ఇంటర్నెట్‌లో సమాచారం వెతకడం అంటే ఇప్పటివరకు గూగుల్ సర్చ్, లింక్‌లపై క్లిక్‌లు, వెబ్‌సైట్ల అన్నదే మనకు సాధారణంగా తెలిసిన విధానం. అయితే ఇంటర్నెట్ ఎలా వాడాలి అన్నదానికి OpenAI ఒక కొత్త కోణాన్ని చూపించేందుకు సిద్ధంగా ఉంది. వచ్చే కొన్ని వారాల్లోనే వారు పూర్తిగా కొత్తగా అభివృద్ధి చేసిన ఓ వెబ్ బ్రౌజర్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నారు. అయితే ఇది కేవలం 'ఇంకొక బ్రౌజర్' మాత్రమే కాకుండా, ఒక విప్లవాత్మక మార్పుకు నాంది కావచ్చని టెక్ పరిశ్రమలో ఇప్పటికే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ బ్రౌజర్ ప్రత్యేకత ఏంటంటే ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేస్తుంది. రాయిటర్స్‌కు చెందిన మూడు వేర్వేరు వ్యక్తుల ప్రకారం, ఈ బ్రౌజర్ వినియోగదారులు ఇంటర్నెట్‌ను ఎలా ఉపయోగిస్తారో మౌలికంగా మార్చే లక్ష్యంతో రూపొందించబడింది. మనం ఇప్పటివరకు బ్రౌజర్లతో చేసే పని ఎలా ఉంటుంది అంటే గూగుల్‌లో టైప్ చేస్తాం, వెబ్‌సైట్లకు వెళ్లి సమాచారం చూస్తాం. కానీ OpenAI పరిచయం చేయనున్న ఈ బ్రౌజర్‌లో, యూజర్లు నేరుగా అదే ఇంటర్‌ఫేస్‌లో ఉండి ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందగలుగుతారు. అది కూడా మరింత వ్యక్తిగతీకరించబడిన విధంగా.
ఇది అంటే, మీరు వెబ్‌లో ఏదైనా సమాచారం కోసం వెతికినప్పుడు, ఈ బ్రౌజర్ మీ అవసరాన్ని అర్థం చేసుకుని, అవసరమైన సమాచారాన్ని సులభంగా, క్లుప్తంగా అందిస్తుంది. ఒక్కో సందర్భంలో అయితే మిమ్మల్ని వేరు వేరు వెబ్‌సైట్లకు పంపే అవసరం కూడా ఉండదు. అన్నీ ఒక్కచోటే ఒకే వేదికపైనే. ఇది ఖచ్చితంగా బ్రౌజింగ్ అనుభూతిని మార్చేస్తుంది.
ఇంకొక ఆసక్తికర అంశం ఏమిటంటే, ఈ బ్రౌజర్‌ను తయారు చేస్తున్న టీమ్‌లో గూగుల్ Chrome డెవలప్‌మెంట్‌లో పనిచేసిన ముఖ్యులు ఉన్నారు. అంటే, గూగుల్ క్రోమ్కి ప్రత్యర్థిగా ఇది మెల్లిగా ఎదగాలన్న ఆలోచన OpenAIకి ఉందన్నమాట. ఇది వినియోగదారుల డేటా, వెబ్ నావిగేషన్ అలవాట్లను మరింత సుదీర్ఘంగా విశ్లేషించి, AI సామర్థ్యాన్ని వినియోగించేలా రూపొందించబడుతోంది.
ChatGPTకి ప్రతి వారం సగటున 500 మిలియన్ యాక్టివ్ వినియోగదారులు ఉన్న నేపథ్యంలో, OpenAI విడుదల చేయబోయే కొత్త బ్రౌజర్ విస్తృతంగా ఉపయోగించబడితే అది గూగుల్‌కి చెందిన Chrome బ్రౌజర్‌కు తీవ్రమైన పోటీగా మారే అవకాశముంది. గూగుల్ క్రోమ్ ద్వారా వచ్చే వెబ్ ట్రాఫిక్‌లో చాలా భాగం గూగుల్ సెర్చ్ కి వెళుతుంది. ఈ సెర్చ్ ట్రాఫిక్ ద్వారా గూగుల్‌కి వచ్చే ఆదాయం కంపెనీ మొత్తం ఆదాయంలో దాదాపు 75 శాతం వరకూ ఉంటోంది. అటువంటి తరుణంలో, OpenAI బ్రౌజర్ ఎక్కువ మంది చేత ఉపయోగించబడితే అది Google యొక్క ప్రధాన ఆదాయ మార్గాన్ని స్వల్పంగానైనా ప్రభావితం చేసే స్థాయికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
దీనికి తోడు పర్ప్లెక్సిటీ సంస్థ తాజాగా Comet అనే కొత్త AI ఆధారిత వెబ్ బ్రౌజర్‌ను విడుదల చేసింది. ఇది సంప్రదాయ బ్రౌజర్ల కంటే భిన్నంగా, యూజర్ అవసరాలను అర్థం చేసుకుని, సమాచారం సేకరణ, టాస్క్‌లను ఆటోమేట్ చేయడంలో సహాయపడేలా రూపొందించబడింది. Cometలో ముందుగా పర్ప్లెక్సిటీ AI సెర్చ్ ఇంజిన్ ఇంటిగ్రేట్ చేయబడింది. దీనివల్ల యూజర్లు వెబ్‌సైట్‌ల మధ్య తిరుగకుండా, సమ్మరీలు, అనువాదాలు, తదితర ఫీచర్లను బ్రౌజర్‌లోనే పొందగలుగుతారు. ముఖ్యంగా, Comet Assistant అనే AI ఏజెంట్ ద్వారా ఈమెయిల్స్, క్యాలెండర్ ఈవెంట్స్, ట్యాబ్‌ల మేనేజ్‌మెంట్ వంటి పనులను సులభంగా చేయవచ్చు.
పర్ప్లెక్సిటీ Comet మరియు OpenAI రూపొందిస్తున్న కొత్త బ్రౌజర్. ఈ రెండు టూల్స్ సంప్రదాయ బ్రౌజింగ్ విధానాన్ని పూర్తిగా మార్చే దిశగా సాగుతున్నాయి. పర్ప్లెక్సిటీ విడుదల చేసిన Comet బ్రౌజర్ సాధారణ ట్యాబ్‌ల బదులు, యూజర్ ప్రశ్నలను నేరుగా సమాధానాలు ఇచ్చేలా రూపొందించబడింది. ఇది సెర్చ్‌లో సమాధానాల కోసం తిరుగుతూ టైమ్ వృథా చేయకుండా, విషయాన్ని ఒకే ఇంటర్‌ఫేస్‌లో క్లుప్తంగా, విశ్వసనీయంగా అందిస్తుంది. ఈ విధానం వల్ల యూజర్ గూగుల్ సెర్చ్‌కి వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండా పోతుంది. OpenAI బ్రౌజర్‌లో యూజర్ వెబ్‌సైట్‌ల మధ్య తిరగకుండా, అన్ని సమాచారాన్ని ఒకే చోట అందించుకునేలా ప్లాన్ చేస్తున్నారు. గూగుల్ వ్యాపార మోడల్‌ను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశముంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications