భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ వినియోగదారుల దేశంగా ఉన్నందున OpenAIకి కీలకమైన మార్కెట్‌గా మారింది. ఈ పెరుగుతున్న డిజిటల్ శక్తిని దృష్టిలో పెట్టుకుని, ChatGPTని రూపొందించిన OpenAI సంస్థ, న్యూఢిల్లీ లో తన తొలి ఇండియా ఆఫీస్‌ను ప్రారంభించేందుకు అడుగులు వేస్తోంది.

మైక్రోసాఫ్ట్ మద్దతుతో నడుస్తున్న ఈ అమెరికన్ కంపెనీ, ఈ ఏడాదిలోపే న్యూ ఢిల్లీలో తన మొదటి ఇండియా ఆఫీస్‌ను ప్రారంభించబోతోందని అధికారికంగా ప్రకటించింది.
ఇప్పటికే OpenAI భారతదేశంలో లీగల్‌గా ఒక కంపెనీగా నమోదు అయింది. స్థానిక ఉద్యోగులను నియమించుకునే పనులు కూడా మొదలయ్యాయి. ఈ విషయాన్ని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
భారతదేశం చాట్‌జీపీటీకి రెండవ పెద్ద మార్కెట్. ఇక్కడ దాదాపు ఒక100 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉండటంతో, OpenAI ప్రత్యేక ప్లాన్‌తో ముందుకు వస్తోంది. తాజాగా భారత్ కోసం ప్రత్యేకంగా రూ. 383 (సుమారు $4.60) మాత్రమే ఖర్చు అయ్యే చవకైన నెలవారీ ప్లాన్ కూడా ప్రారంభించింది.
ఇక మరోవైపు, భారత్‌లో ఆఫీసు పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న OpenAIకి కొన్ని చట్టపరమైన సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. పత్రికలు, పబ్లిషర్లు తమ కథనాలు, కంటెంట్‌ను వారి అనుమతి లేకుండా ట్రైనింగ్ కోసం వాడుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై వివిధ మీడియా హౌసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, OpenAI మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపడేస్తు తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టంగా చెబుతోంది. కేవలం లైసెన్స్ పొందిన పబ్లిక్ డేటాను మాత్రమే వాడుతున్నామని సంస్థ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో, OpenAI CEO సామ్ ఆల్ట్‌మన్ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. "AI for India, with India" అనే నినాదాన్ని పలుకుతు, భారత్‌లో ఆఫీస్ ప్రారంభించడం తమకు ఒక కీలకమైన మొదటి అడుగని అన్నారు. ఆధునిక AI పరిజ్ఞానాన్ని భారతీయులకు మరింత సులభంగా అందుబాటులోకి తేవడమే కాకుండా, భారత అవసరాలకు అనుగుణంగా ఉండే AI టెక్నాలజీను భారత్‌లోనే అభివృద్ధి చేయాలని OpenAI లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పారు.
సామ్ ఆల్ట్‌మన్ ప్రకారం, భారత మార్కెట్ OpenAIకి చాలా కీలకం. ఇక్కడి విస్తారమైన ఇంటర్నెట్ వినియోగదారుల ఆధారాన్ని దృష్టిలో పెట్టుకుని, కంపెనీ స్థానికంగా ఉన్న ప్రతిభను వినియోగించుకోవాలని, అలాగే AI అభివృద్ధిలో భారత్‌నే ఒక ప్రధాన కేంద్రంగా మార్చాలని ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు.
OpenAI కి భారత్‌లో పోటీ మరింత కఠినంగా మారుతోంది. ఇప్పటికే గూగుల్ తన జెమినీ మోడల్‌తో, అలాగే పర్‌ప్లెక్సిటీ AI వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఉచిత ప్లాన్లను అందిస్తూ భారత మార్కెట్‌లో బలమైన పట్టు సాధించాయి. వీటి వల్ల యూజర్ల సంఖ్య పెరిగి, OpenAIకి తన స్థానాన్ని నిలుపుకోవడం ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా విద్యార్థుల విభాగంలో పోటీ మరింత పెరుగుతూంది.
OpenAI తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ChatGPT విద్యార్థి యూజర్లలో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే, వారానికి యాక్టివ్‌గా ChatGPT వాడుతున్న భారత విద్యార్థుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందని కంపెనీ స్పష్టం చేసింది. ఇది భారతదేశంలో AI వినియోగం ఎంత వేగంగా పెరుగుతోందో తెలుస్తుంది. కొత్త టెక్నాలజీను అంగీకరించడంలో విద్యార్థులు ముందుంటారనే వాస్తవం ఇక్కడ మరోసారి రుజువైంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications