Microsoft: ప్రస్తుతం టెక్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఏఐ ఉత్పత్తి చాట్ జీపీటీ. దీనిని అందిస్తున్న కంపెనీ ఓపెన్ ఏఐలో పెద్ద తుఫాను కొనసాగుతోంది. వాస్తవానికి కంపెనీ బోర్డు సీఈవోను తొలగించటంతో గేమ్ స్టార్ట్ అయ్యింది.
తాజాగా తొలగింపబడ్డ సీఈవో ఆల్ట్‌మాన్‌ను మైక్రోసాఫ్ట్ ఆహ్వానించింది. అతడి చేరికను ఏకంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ధృవీకరించటం ప్రస్తుతం పెను సంచలనాలకు దారితీస్తోంది. దీంతో సామ్ పేరుతో టెక్ దిగ్గజం తన అడ్వాన్డ్ ఏఐ రీసెర్చ్ ముందుకు సాగుతాయని వెల్లడించింది. ఈ క్రమంలో చాట్ జీపీటీలో పనిచేస్తున్న దాదాపు 500 మంది ఉద్యోగులు తాము ఉద్యోగానికి రాజీనామా చేసి మైక్రోసాఫ్ట్ లో చేరతామని బెదిరించినట్లు వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం ఓపెన్ ఏఐలో 770 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 500 మందికి పైగా ఉద్యోగులు కంపెనీ బోర్డుకు కీలక లేఖ రాసినట్లు ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది. ఇదే క్రమంలో ఆల్ట్‌మన్‌ను తొలగించే ప్రయత్నాలకు నాయకత్వం వహించిన ఓపెన్‌ఏఐ చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సట్స్‌కేవర్ మాట్లాడుతూ.. బోర్డు చర్యలలో తాను పాల్గొన్నందుకు తీవ్రంగా విచారిస్తున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తాను ఓపెన్ ఏఐకి హాని కలిగించాలని అనుకోలేదని చెప్పారు. కలిసి నిర్మించిన ప్రతిదాన్ని తాను ప్రేమిస్తున్నానని.. కంపెనీని తిరిగి కలపడానికి తాను చేయదగినదంతా చేస్తానన్నారు.
ఉద్యోగులు రాసిన లేఖను పరిశీలిస్తే.. ఓపెన్ ఏఐ కంపెనీ బోర్డు సామ్ ఆల్ట్‌మన్‌ను సీఈవో పదవి నుంచి తప్పించటం, సహవ్యవస్థాపకుడైన గ్రెగ్ బ్రాక్‌మన్‌ను బోర్డు నుంచి తొలగించటం వల్ల తమ మిషన్, కంపెనీని బలహీనపరిచిందంటూ పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత యాజమాన్యానికి ఓపెన్ ఏఐని పర్యవేక్షించే సామర్థ్యం లేదని తాజా ప్రవర్తన స్పష్టం చేసిందంటూ హెచ్చరించారు. ఈ క్రమంలోనే కొత్త అనుబంధ సంస్థలో ఓపెన్‌ఆల్ ఉద్యోగులందరికీ పొజిషన్‌లు ఉన్నాయని మైక్రోసాఫ్ట్ వారికి హామీ ఇచ్చింది.
ప్రస్తుత బోర్డు సభ్యులందరూ రాజీనామా చేసి.. బ్రెట్ టేలర్, విల్ హర్డ్ వంటి ఇద్దరు కొత్త ప్రధాన స్వతంత్ర డైరెక్టర్లను బోర్డు నియమించాలన్నారు. అలాగే సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్‌లను తిరిగి నియమించకపోతే తాము కంపెనీని విడుతామని లేఖలో స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications