క్రియేటర్స్‌కే దిమ్మతిరిగే షాకిచ్చిన ChatGPT.. ఈ ఫీచర్ రిజల్ట్స్ చూసి OpenAIలో ఆందోళన
ChatGPT: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ మనుగడకు సవాలు విసురుతుందని పలువురు నిపుణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంత ఇబ్బంది ఉండదని, కంట్రోల్ చేయవచ్చని మరికొందరి వాదన. అయితే AI సంచలనం ChatGPT తాజాగా క్రియేటర్స్ కే షాక్ ఇచ్చింది.
ఇప్పటివరకు కేవలం AI ఆధారిత భాషా మోడల్ గా వ్యాసాలు, కథనాలు, రిపోర్ట్స్ తో కూడిన సృజనాత్మక కంటెంట్ ను ChatGPT అందిస్తోంది. పలు చిత్రాలను విశ్లేషించి స్పష్టమైన వివరాలను అందిచగలిగే కొత్త సామర్థ్యాన్ని ప్రస్తుతం పరీక్షిస్తున్నారు. అందులో ChatGPT ప్రతిభను చూసిన అనంతరం.. ఈ టెక్నాలజీ దుర్వినియోగమయ్యే అవకాశం ఉందంటూ OpenAI ఆందోళన వ్యక్తం చేస్తోందని ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది.

జోనాథన్ మోసెన్ అనే అంధుడు సహాయం కోసం చాలా కాలం నుంచి AI సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇమేజెస్ విశ్లేషించే కొత్త ఫీచర్ ను పరీక్షించడానికి బీటా టెస్టింగ్ లో ఆయనను OpenAI ఎంపిక చేసింది. బాత్రూంలోని షాంపూ, కండీషనర్, షవర్ జెల్‌ను గుర్తించడానికి ఆయన ఈ టెక్నాలజీని ఉపయోగించారు. తద్వారా ప్రతి బాటిల్ లో ఉన్న మిల్లీలీటర్ల కెపాసిటీని, షవర్‌లోని టైల్స్ రకాన్ని సైతం గుర్తించగలిగారు.
ఈ టెస్టింగ్ అత్యద్భుత ఫలితాలను ఇచ్చినప్పటికీ, OpenAI మాత్రం తీవ్ర నిరాశకు గురైంది. ఫేషియల్ రికగ్నిషన్ కోసం ఈ ఫీచర్ ఉపయోగిస్తే గోప్యతా సమస్యలకు కారణమవుతుందని కంపెనీ భావిస్తోంది. తాజా సాంకేతికత సెలబ్రిటీలను, వికీపీడియా పేజీని సైతం గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉందట. ఈ ఫీచర్‌ని విస్తృతంగా అందుబాటులో ఉంచితే చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతోంది.
కొత్త ఫీచర్ పై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని OpenAI భావిస్తున్నట్లు కంపెనీ పాలసీ పరిశోధకురాలు సంధిని అగర్వాల్ తెలిపారు. ఒకవేళ వారి నుంచి నెగటివ్ సమాధానం వస్తే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఇమేజ్ ఎనాలిసిస్ భ్రాంతిని కలిగిస్తుందని పేర్కొంది. ఒక కంపెనీ CEO చిత్రాన్ని ఇస్తే, మరో సంస్థ CEO పేరు ఇచ్చి భ్రమింప చేసే అవకాశం ఉందని చెప్పింది.


Click it and Unblock the Notifications