దివాళా అంచున ChatGPT.. 2024 చివరి నాటికి ఖేల్ ఖతం.. అసలేం జరుగుతోంది?
ChatGPT: ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ దిశగా ముందుకు సాగుతోంది. దీనికి ముఖ్య కారణం 'చాట్ జీపీటీ' అని ఒప్పుకోక తప్పదు. అంతకు ముందే AI టెక్నాలజీ అందుబాటులో ఉన్నా ChatGPT తర్వాత దానికి ప్రాముఖ్యత విపరీతంగా పెరిగినట్లు పలు నివేదికలు సైతం స్పష్టం చేశాయి. అయితే ఈ వైభవానికి త్వరలోనే శుభం కార్డు పడనుంది.
ChatGPTని సామ్ ఆల్ట్ మన్ నేతృత్వంలోని OpenAI రూపొందించింది. అయితే ఆ సంస్థ ఆర్థిక సంక్షోభం అంచున ఉన్నట్లు ఎనలిటిక్స్ ఇండియా మేగజైన్ నివేదించింది. ChatGPT నిర్వహణ కోసం OpenAI రోజుకు 5.80 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది. తద్వారా కంపెనీ ఆర్థిక వనరులు వేగంగా క్షీణిస్తున్నట్లు వెల్లడించింది. ఇదే కంటిన్యూ అయితే 2024 చివరి నాటికి దివాళా తీయడం ఖాయమని హెచ్చరించింది.

GPT-3.5, GPT-4లను మోనటైజ్ చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ.. కంపెనీ ఖర్చులు కవరయ్యే స్థాయిలో ఆదాయం సాధించలేకపోయిందని నివేదిక పేర్కొంది. ChatGPT ప్రారంభంలో వినియోగదారుల తాకిడి భారీగా ఉన్నా క్రమంగా ఈ జోరు నెమ్మదించినట్లు తెలిపింది. జూన్ తో పోలిస్తే జూలై 2023లో యూజర్స్ సంఖ్య 12 శాతం తగ్గినట్లు చెప్పింది.
ఇప్పుడైతే కంపెనీ ఖర్చులను మైక్రోసాఫ్ట్ సహా ఇతర పెట్టుబడిదారులు భరిస్తున్నారు. కానీ ChatGPT భవిష్యత్తు మనుగడ మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఉంటుందని ఎనలిటిక్స్ ఇండియా అభిప్రాయపడింది. ఏదో ఒకటి చేసి సంస్థ రెవెన్యూ పెంచితే తప్ప దివాళా పరిస్థితి నుంచి OpenAI గట్టెక్కలేదని భావిస్తోంది.


Click it and Unblock the Notifications