For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

AI: యూరోపియన్ యూనియన్‌ ను బెదిరించిన OpenAI CEO.. కారణం ఏమిటంటే..

|

AI: ప్రస్తుతం టెక్ ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంట పడుతోంది. OpenAI ప్రారంభించిన ఈ రేస్ లో వెనకబడి పోకూడదని ఆయా దిగ్గజ సంస్థలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోపక్క మానవాళికి AI ప్రమాదకరంగా పరిణమించవచ్చనే ఊహాగానాలు భయపెడుతున్నాయి. ఈ క్రమంలో పలు దేశాలు కఠిన చట్టాలు అమల్లోకి తీసుకువచ్చేలా కసరత్తు చేస్తున్నాయి.

కీలక కృత్రిమ మేధస్సు (AI) చట్టాన్ని ప్రస్తుత రూపంలో కొనసాగిస్తే యూరోపియన్ యూనియన్ (EU) నుంచి వైదొలుగుతామని OpenAI CEO సామ్ ఆల్ట్‌ మాన్ రెగ్యులేటర్లను హెచ్చరించారు. ఈ చట్టం పలు మార్పులకు గురవుతుండగా.. OpenAIకి చెందిన ChatGPT మరియు GPT-4 వంటి పెద్ద AI మోడల్స్ ను "అధిక ప్రమాదం"గా పేర్కొనాల్సిన అవసరం ఏర్పడవచ్చు అని ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.

OpenAI CEO Altman threatens to quit EU

యూనివర్శిటీ కాలేజ్ లండన్‌ లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆల్ట్‌ మాన్ ఈ విషయంపై మాట్లాడారు. కొత్తగా రూపొందించిన AI చట్టాన్ని పాటించలేని పక్షంలో EUలో తమ ఆపరేషన్స్ నిలిపివేస్తామని స్పష్టం చేశారు. "మేము ఆ నిబంధనలు పాటించడానికి ప్రయత్నిస్తాము. లేకపోతే మా కార్యకలాపాలను ఆపేస్తాం. మొదట ప్రయత్నమైతే చేస్తాము. కానీ దానికి కొంత సాంకేతిక పరిమితులు ఉన్నాయి" అని ఆల్ ట్‌మాన్ వెల్లడించారు.

EU చట్టంలోని AI సిస్టమ్స్ "హై రిస్క్" హోదాపై OpenAI వ్యతిరేకత తెలుపుతోంది. AI ద్వారా ఏర్పడే ప్రమాదాల గురించి తాను సైతం ఆందోళన చెందుతున్నట్లు ఆల్ట్‌ మాన్ చెప్పారు. ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన తప్పుడు సమాచారం.. రాబోయే 2024 US ఎన్నికలపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు. AI లాంగ్వేజ్ మోడల్స్ కంటే సోషల్ మీడియా ప్లాట్‌ ఫారమ్‌లే తప్పుడు సమాచారానికి డ్రైవర్లుగా పని చేస్తున్నాయన్నారు.

English summary

AI: యూరోపియన్ యూనియన్‌ ను బెదిరించిన OpenAI CEO.. కారణం ఏమిటంటే.. | OpenAI CEO Altman threatens to quit EU

OpenAI CEO Altman threatens to quit EU
Story first published: Thursday, May 25, 2023, 21:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X