ఏఐ ఏజెంట్లు: మీ ఉద్యోగం పోతుందా? ఓపెన్‌ఏఐ షాకింగ్ నిజం!

ఏఐ టెక్నాలజీ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు పోతాయనే భయం అందరిలోనూ ఉంది. చాలా పనులు ఆటోమేషన్​కు వెళ్లిపోతాయని, మనుషులకు ఉపాధి కరువవుతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ మార్పు రావడానికి కనీసం 10-15 ఏళ్లు పడుతుందని ఇప్పటివరకు అందరూ భావిస్తున్నారు.

కానీ, ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఓపెన్‌ఏఐ ఒక షాకింగ్ విషయం చెప్పింది. తమ కంపెనీలో ఒక మనిషి ఒక రోజులో చేసే పనిని, తమ ఏఐ ఏజెంట్లు (AI Agents) కొన్ని గంటల్లోనే పూర్తి చేస్తున్నాయని వెల్లడించింది. ఒక ఉద్యోగి 3.1 రోజుల్లో చేసే పనిని, ఏఐ ఏజెంట్లు ఒక్క రోజులోనే ముగించేస్తున్నాయని తెలిపింది.

అంటే, ఒక ఉద్యోగి ఒక రోజులో 8 గంటలు పనిచేస్తాడనుకుంటే, అదే 8 గంటల సమయంలో ఏఐ ఏజెంట్లు 3.1 రోజుల పనిని పూర్తి చేస్తున్నాయన్నమాట. ఈ ప్రకటనతో టెక్ ప్రపంచంలో ఆటోమేషన్‌పై కొత్త చర్చ మొదలైంది.

దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి, 'ఉదాహరణకు' టీసీఎస్‌ను తీసుకుందాం. జూన్ 30 నాటి డేటా ప్రకారం, టీసీఎస్‌లో ప్రస్తుతం 593,798 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏఐ టెక్నాలజీని పూర్తిగా వాడితే, వీరంతా చేసే పనిని కేవలం 144,829 మంది ఉద్యోగులతోనే పూర్తి చేయొచ్చు. అంటే, ఉన్న ఉద్యోగుల్లో కేవలం 24.4 శాతం మంది ఉంటే చాలు. మిగిలిన 75.6 శాతం మందిని తొలగించవచ్చన్నమాట.

ఉద్యోగం కోల్పోయిన వారి స్థానంలో 448,969 ఏఐ ఏజెంట్లను నియమించాల్సి ఉంటుంది. అయితే, ఆ మిగిలే 144,829 మందిలో మనం ఉంటామా లేదా అన్నదే ఇప్పుడు అందరినీ భయపెడుతున్న ప్రశ్న.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఓపెన్‌ఏఐ కంపెనీ ప్రస్తుతం కేవలం 4500 నుంచి 7850 మంది ఉద్యోగులతోనే నడుస్తోంది. 2022లో ఈ కంపెనీలో పనిచేసిన వారు కేవలం 375 మందే కావడం గమనార్హం.

ఏఐ ఏజెంట్ అంటే మనం సాధారణంగా వాడే చాట్‌బాట్‌లు అనుకుంటే పొరపాటే. ప్రశ్న అడిగితే సమాధానం చెప్పడమే వాటి పని. కానీ, ఏఐ ఏజెంట్లు అలా కాదు. వీటికి ఒక టాస్క్ అప్పగిస్తే చాలు. ఆ పని పూర్తి చేయడానికి కావాల్సిన సమాచారాన్ని అవే వెతుక్కుంటాయి, పనులను దశలవారీగా అవే పూర్తి చేస్తాయి, చేసిన పనిని ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని, చివరికి మొత్తం పనిని పూర్తి చేసి మన చేతిలో పెడతాయి. ఇవి ఒక పూర్తిస్థాయి ఏఐ వ్యవస్థలు.

వీటి సహాయంతోనే ఏఐ కంపెనీలు తమ మోడళ్లను వేగంగా మెరుగుపరుచుకుంటూ, కొత్త వెర్షన్లను చకచకా లాంచ్ చేస్తున్నాయి.

అసలు సమస్య ఏంటంటే, ఈ ఆటోమేషన్ ప్రభావం ఇతర రంగాల కంటే ముందే ఓపెన్‌ఏఐలోనే స్పష్టంగా కనిపిస్తోంది. కంపెనీలో రోజురోజుకీ పెరిగిపోతున్న పనులను ఏఐ ఏజెంట్లే పూర్తి చేస్తున్నాయి. మానవ ఉద్యోగులు కేవలం వాటిని పర్యవేక్షించడం మాత్రమే చేస్తున్నారు.

ఇదే వేగంతో ప్రపంచంలోని అన్ని రంగాల్లో, అన్ని పనుల్లో ఆటోమేషన్ జరిగితే.. మానవ ఉద్యోగుల అవసరం వేగంగా తగ్గిపోవడం ఖాయం.

తమ ఆటోమేషన్ సామర్థ్యంపై ఓపెన్‌ఏఐ విడుదల చేసిన ఒక రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించింది. "గతంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక నిపుణులు అవసరమయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ పనిని కూడా మా ఏఐ ఏజెంట్లే చూసుకుంటున్నాయి."

"ఇకపై అలాంటి నిపుణుల అవసరం లేదు" అని ఆ సంస్థ బహిరంగంగానే ప్రకటించింది. అదే సమయంలో, మానవ ఉద్యోగులు ప్రస్తుతం రీసెర్చ్, ఇన్నోవేషన్ విభాగాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని తెలిపింది. ఏఐ ఏజెంట్ల కోసం కొత్త పనులు సృష్టించడం, అవి చేసిన పనులను సమీక్షించడం వంటి బాధ్యతలను మనుషులు చూసుకుంటున్నారని ఓపెన్‌ఏఐ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+