కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచి పోవడంతో వివిధ రంగాల్లో డిమాండ్ పడిపోయింది. ముఖ్యంగా షట్ డౌన్ కారణంగా ప్రయాణాలు, షిప్పింగ్స్ లేక చమురుకు డిమాండ్ లేదు. అందుకే ఓ సమయంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ 20 డాలర్లకు పడిపోయింది. క్రమంగా ఆర్థిక వ్యవస్థలు తెరుచుకుంటుండటంతో బ్యారెల్ చమురు ఇప్పుడు 40 డాలర్లు పైకి చేరుకుంది. అయినప్పటికీ ఆశించిన మేర డిమాండ్ పెరగలేదు.

1991 గల్ప్ వార్ తర్వాత అతి తక్కువ ఉత్పత్తి
కరోనా మహమ్మారి రెండోసారి పుంజుకుంటుందనే ఆందోళనలు, అత్యవసరమైతే ఎవరూ బయటకు రాకపోవడం, షిప్పింగ్స్, ప్రయాణాలు తగ్గిపోవడంతో చమురుకు ఆశించిన డిమాండ్ లేదు. ఈ నేపథ్యంలో 1991లో గల్భ్ యుద్ధం తర్వాత తొలిసారి ఉత్పత్తిని పెద్ద ఎత్తున కనిష్టస్థాయికి తగ్గించాయి ఒపెక్ దేశాలు. ప్రధానంగా కరోనా రెండోసారి విజృంభిస్తుందనే భయాలు కమ్ముకున్నాయి. మే నెల నుండి ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గిస్తూ వస్తున్నాయి.

ఆ నిర్ణయం మేరకు..
ఆర్గనైజేషన్ ఆప్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (OPEC) దేశాలు గత నెలలో ఉత్పత్తిని రోజుకు 1.93 మిలియన్ బ్యారెళ్లను తగ్గించి 22.69 మిలియన్ బ్యారెళ్లకు సరిపెట్టాయి. మే 1991 తర్వాత ఇదే అత్యల్పం. ఏప్రిల్ నెలలో జరిగిన ఒపెక్ దేశాల సమావేశంలో రోజుకు 9.7 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి. ఇది ప్రపంచవ్యాప్త సరఫరాలో 10 శాతం కావడం గమనార్హం. ఇందులో కొన్ని దేశాలు జూన్ నెలలో మరింత తగ్గించుకుంటామని చెప్పాయి. దీంతో మొత్తంగా పెద్ద మొత్తంలో ఉత్పత్తి తగ్గింది.

సౌదీ, రష్యా..
సౌదీ అరేబియా జూన్ నెలలో రోజుకు 1.13 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించి 7.53 మిలియన్ డాలర్లకు పరిమితం చేసింది. కువైట్, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ వంటి దేశాలు కూడా ఉత్పత్తిని తగ్గించాయి. మొత్తంగా ఒపెక్ దేశాలు ఏప్రిల్ నెలలో తీసుకున్న నిర్ణయం మేరకు చమురు ఉత్పత్తిని తగ్గించాయి. ఒపెక్ వెలుబలి దేశాలు ఉత్పత్తిని భారీగానే తగ్గించాయి. ఈ దేశాలు డిమాండ్-పతనం, ధరల ఆధారంగా కూడా ఉత్పత్తి చేస్తాయి. రష్యా, కజకిస్తాన్‌లు కూడా ఉత్పత్తిని తగ్గించాయి. ఒపెక్ దేశాలు, రష్యా ఆగస్ట్ నుండి కూడా చమురు ఉత్పత్తి కోతను తగ్గించాలని భావిస్తున్నాయి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications