Crude Oil: క్రూడాయిల్ ధరలు సరఫరా, డిమాండ్ ఆధారంగా నిరంతరం మారుతూ ఉంటాయి. అయితే గత 3 నెలల కాలంలో.. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం, యునైటెడ్ స్టేట్స్ సహా దేశాలలో వడ్డీ రేట్ల పెంపు, ధరల పెరుగుదల కారణంగా క్రూడాయిల్ డిమాండ్ క్రమంగా తగ్గింది. ఈ క్రమంలో ముడి చమురు ధర బ్యారెల్ కు 120 డాలర్ల నుంచి 90 డాలర్లకు తగ్గింది. ఈ క్రమంలో ఉత్పత్తిని తగ్గించాలని OPEC+ కూటమి నిర్ణయించింది.

ఉత్పత్తి తగ్గింపు..
2020 కరోనా మహమ్మారి తర్వాత వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభమైనందున మార్కెట్ డిమాండ్ తీర్చేందుకు OPEC + దేశాలు చమురు ఉత్పత్తిని పెంచాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో చమురు ధరలను పెంచేందుకు తద్వారా అదనపు ఆదాయన్ని పొందాలని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం తమ ఉత్పత్తిని ప్రతి రోజూ 20 లక్షల బ్యారెళ్లు తగ్గించాలని డిసైడ్ అయ్యాయి.

అమెరికాను కాదంటూ..
చమురు ఉత్పత్తిని తగ్గిచటం వల్ల తమ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని అగ్రరాజ్యం అమెరికా చెప్పినప్పటికీ OPEC+ కూటమి వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు మళ్లీ పెరగటం ప్రారంభం కానున్నాయి.

సామాన్యులపై భారం..
ముడిచమురు ధరలు పెరిగితే నిత్యావసరాల ధరలు మరింతగా పెరుగుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ చర్య వల్ల ప్రపంచ దేశాలు మళ్లీ తీవ్ర వడ్డీ రేట్ల పెంపును ప్రకటించాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. ఇదే జరిగితే ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి మందగించి కుప్పకూలే ప్రమాదం ఉంది.

చమురు నిల్వలు..భారత్ పరిస్థితి..
ఈ ఆకస్మిక మార్పును ఎదుర్కొనేందుకు అమెరికాతో సహా అన్ని దేశాలు తమ నిల్వల నుంచి అదనపు ముడి చమురును రానున్న కొద్ది రోజుల్లో మార్కెట్‌లోకి తీసుకురానున్నాయి. కానీ ధరల పెరుగుదలను నియంత్రించలేవని తెలుస్తోంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ధరలు తగ్గించే అవకాశం లేదు. ఒపెక్ + కోత కారణంగా భారత్ కొనుగోలు చేసే ముడి చమురు ధర పెరిగితే.. పెట్రోల్, డీజిల్, జెట్ ఇంధనం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయంగా రష్యా నుంచి దిగుమతి చేసుకోవచ్చని తెలుస్తోంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications