అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్-1బీ (H-1B) వీసా విధానంపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం.. అమెరికాలో పనిచేయడానికి విదేశీ నిపుణులు దరఖాస్తు చేసుకునే ప్రతి H-1B వీసాపై ఏటా లక్ష డాలర్లు రుసుము విధించబడుతుంది. మన కరెన్సీలో చెప్పాలంటే.. దాదాపు రూ.88 లక్షల రూపాయలు అవుతుంది.ట్రంప్ ఈ విధానాన్ని త్వరలో అమలులోకి తీసుకురావాలని ప్రకటించారు.
ఈ విధానాన్ని సపోర్ట్ చేస్తూ అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐటీ కంపెనీలు అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలి. పనికి రాని వ్యక్తులను అమెరికాలోకి రాకుండా ఆపాలి. కేవలం అత్యుత్తమ, విలువైన వ్యక్తులు మాత్రమే అమెరికాకు రావాలి. శిక్షణ ఇవ్వాలంటే, మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులను మాత్రమే ఎంచుకోండి అంటూ Howard Lutnick కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపతున్నాయి. నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా ఈ వీసా ద్వారా అమెరికాలో చేరుతున్న నేపథ్యంలో.. హోవార్డ్ వ్యాఖ్యలు భారతీయులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఉన్నాయని కొంతమంది భావిస్తున్నారు.

ప్రస్తుతానికి H-1B వీసాదారులలో భారతీయులు 71 శాతం మంది ఉన్నారు. ఇక చైనీయులు 11.7 శాతం వాటా కలిగి ఉన్నారు. ఈ వీసాలు సాధారణంగా మూడు నుంచి ఆరు సంవత్సరాల కాలం పాటు మంజూరు చేయబడతాయి. తెలుగు రాష్ట్రాలలో H-1B వీసా కలిగిన వ్యక్తుల సంఖ్య 28 లక్షలకు చేరిందని సమాచారం. H-1B వీసా ద్వారా చాలా మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం వీసా పొందడానికి లాటరీ విధానం కొనసాగుతోంది. మొదట దరఖాస్తు చేసుకునే సమయంలో సాధారణ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది, లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు ఉంటాయి. చాలా సందర్భాల్లో, కంపెనీలు ఈ ఫీజులను భరిస్తాయి.
తాజాగా ట్రంప్ ప్రకటించిన లక్ష డాలర్ల రుసుము, కంపెనీలపై తీవ్ర ఆర్థిక భారంగా మారనుంది. అమెరికా ప్రభుత్వం ప్రతి ఏడాది సుమారు 85 వేల H-1B వీసాలను లాటరీ ద్వారా జారీ చేస్తోంది. కొత్త ఫీజు విధానం అమలులోకి వచ్చిన తర్వాత.. భారతీయులు, ఇతర విదేశీ నిపుణులు అమెరికా వీసాలు పొందడంలో సమస్యలు ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలు వేలాది మంది భారతీయులను ఈ వీసాల ద్వారా నియమించుకుంటున్నాయి. కొత్త ఫీజు నియమం అమల్లోకి వస్తే, ప్రతి సారి రెన్యువల్ చేసుకునే సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇప్పటికే గ్రీన్ కార్డ్ కోసం భారతీయులు సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నారు. ఈ కొత్త భారంతో వారికి అమెరికా కల మరింత కష్టతరం కానుంది.
More From GoodReturns

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

చైనాతో రహస్యంగా జతకట్టిన ఇరాన్.. అమెరికాకు బిగ్ షాక్..హార్ముజ్ జలసంధి వేదికగా డాలర్ ఆధిపత్యానికి చెక్..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

అప్పుల కుప్పగా అమెరికా.. కొంపలు ముంచబోతున్న 1974 వ ఏడాది నిర్ణయాలు.. కియోసాకి వార్నింగ్..

ఈ రోజు రాత్రి ఇరాన్ శ్మశానంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన..

Iran war: హోర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం.. ఊపిరి పీల్చుకోనున్న ఆయిల్ మార్కెట్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications