Meesho News: జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేని వ్యాపారులకు మీషో సదవకాశం.. పూర్తి వివరాలు..
Meesho: ప్రస్తుతం చాలా మంది తమ వ్యాపారాలను ఎక్కువ మందికి చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తమ ఉత్పత్తులను ఆన్ లైన్ ఈ-కామర్స్ వేధికలపై విక్రయించాలని చూస్తున్నారు. అలాంటి వారికి ఇది పెద్ద శుభవార్త.
అవును దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ దిగ్గజమైన మీషో దీనికి సదవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే కంపెనీ గడచిన రెండు నెలలుగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేని 25,000 మంది వర్తకులను తన ఫ్లాట్ ఫారమ్‌పైకి చేర్చుకుంది. దాదాపు 15-20 మిలియన్ల మంది ఇలాంటి వర్తకులను చేర్చుకునే లక్ష్యంగా కంపెనీ అక్టోబర్ 1 నుంచి తాజా వెసులుబాటును తీసుకొచ్చింది.

వాస్తవానికి జూలైలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చిన్న వ్యాపారులు రాష్ట్రం వెలుపల ఈకామర్స్ ఫ్లాట్ ఫారమ్ల ద్వారా విక్రయాలు జరిపేందుకు వెసులుబాటును కల్పించింది. అయితే ఇందులో సదరు వ్యాపారుల వస్తువుల వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలు, సేవల విషయంలో టర్నోవర్ రూ.20 లక్షల కంటే తక్కువగా ఉన్నట్లయితే ఎలాంటి జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదని పేర్కొంది. అయితే ఈ పరిమితులకు మించి టర్నోవర్ ఉన్న సంస్థలు ఈకామర్స్ విక్రయాలు జరపాలంటే తప్పకుండా జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ప్రస్తుతం మీషో ఏపీ, అసోం, బీహార్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాలకు చందిన కొత్త నాన్ జీఎస్ట్రీ విక్రేతలను తాజాగా 40 శాతానికి పైగా చేర్చుకుంది. ఈ అమ్మకందారులలో చాలామంది గతంలో వారి స్వంత వెబ్‌సైట్‌లతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆపరేట్ చేసేవారు. 2027 నాటికి కంపెనీ మెుత్తం కోటి మంది విక్రేతలను డిజిటలైజేషన్ ద్వారా తన ఫ్లాట్ ఫారమ్ మీదకు చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.


Click it and Unblock the Notifications