For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రి వేళల్లో ఆన్ లైన్ లో డబ్బుల లావాదేవీలు చేస్తున్నారా ? అయితే తస్మాత్ జాగ్రత్త !! ఎందుకంటే ..

|

దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారు. ఏ మాత్రం చిన్న అజాగ్రత్తతో వ్యవహరించినా, అకౌంట్లను ఖాళీ చేసేస్తున్నారు . ఇటీవల కాలంలో కొత్త కొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు రాత్రివేళల్లో తమ దందాను జోరుగా సాగిస్తున్నారని , రాత్రి సమయాల్లో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలనుకునేవారు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు చెప్తున్నారు.

జాక్ మా కు చైనా మరో షాక్ .. గుత్తాధిపత్య ఆరోపణలపై అలీబాబాకు 2.78 బిలియన్ డాలర్ల జరిమానాజాక్ మా కు చైనా మరో షాక్ .. గుత్తాధిపత్య ఆరోపణలపై అలీబాబాకు 2.78 బిలియన్ డాలర్ల జరిమానా

 క్రెడిట్ కార్డులు ఇస్తామని , క్యాష్ బ్యాక్ వచ్చిందని .. ఆన్ లైన్ మోసాలు

క్రెడిట్ కార్డులు ఇస్తామని , క్యాష్ బ్యాక్ వచ్చిందని .. ఆన్ లైన్ మోసాలు

దేశంలో సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. క్రెడిట్ కార్డులు ఇస్తామని కొందరు, క్యాష్ బ్యాక్ వచ్చిందని కొందరు రకరకాల మార్గాల ద్వారా వ్యక్తిగత డేటాను చోరీ చేసి బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు. ఇక ఆన్లైన్ మోసాల ఉచ్చులో చిక్కుకుని చాలామంది నిలువునా మునుగుతున్నారు . కష్టపడి సంపాదించిన సంపాదనను పోగొట్టుకుంటున్నారు. ప్రముఖ బ్యాంకుల పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి, వాటి ద్వారా ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నట్టు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే భారత్ ఆర్ధిక వ్యవస్థపై చైనా హ్యాకర్ల పంజా .. ఇంటిలిజెన్స్ హెచ్చరిక

ఇప్పటికే భారత్ ఆర్ధిక వ్యవస్థపై చైనా హ్యాకర్ల పంజా .. ఇంటిలిజెన్స్ హెచ్చరిక

బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు ఎప్పుడు లావాదేవీలకు సంబంధించిన ఓటిపి అడగవు. కానీ సైబర్ నేరగాళ్లు బ్యాంకులు పేరుతో మన ద్వారానే వ్యక్తిగత వివరాలను, లావాదేవీల ఓటీపీ నెంబర్ తెలుసుకుంటూ ఎంచక్కా దోచేస్తున్నారు. కరోనా వ్యాప్తికి ముందు కంటే , కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత సైబర్ నేరాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. డిజిటల్ వేదికలమీద మోసం అర్థం కాకుండానే జరిగిపోతుంది. ఇప్పటికే చైనా హ్యాకర్లు భారతదేశం మీద దాడి చేస్తున్నారని, భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఇంటలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

రాత్రి వేళల్లో యాక్టివ్ గా ఉండే చైనా హ్యాకర్లు , లావాదేవీలు చేస్తే అంతే సంగతి

రాత్రి వేళల్లో యాక్టివ్ గా ఉండే చైనా హ్యాకర్లు , లావాదేవీలు చేస్తే అంతే సంగతి

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో రాత్రి తొమ్మిది దాటింది అంటే సైబర్ నేరగాళ్ళు మరింత యాక్టివ్ గా ఉంటున్నట్లుగా గుర్తించారు . అత్యవసరమైతే తప్ప రాత్రివేళల్లో డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయొద్దని పలువురు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంతో పోలిస్తే ఆన్లైన్ లావాదేవీలు కరోనా కారణంగా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆన్లైన్ లావాదేవీలను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచేస్తున్నారు. రాత్రంతా ఇదే బిజీలో ఉంటున్నారు.

 రాత్రి వేళల్లో వందల కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్ళు .. తస్మాత్ జాగ్రత్త

రాత్రి వేళల్లో వందల కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్ళు .. తస్మాత్ జాగ్రత్త

వందల కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. అందుకే సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకులకు సంబంధించిన సందేశాల విషయంలో కూడా జాగ్రత్త వహించాలని, రాత్రి వేళల్లో మరీ అవసరం అయితే తప్ప ఆర్ధిక లావాదేవీలు చెయ్యొద్దని , అనుమానాస్పదంగా ఉన్న సందేశాలను అసలు ఓపెన్ కూడా చేయొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ కష్టార్జితాన్ని కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండాలని తస్మాత్ జాగ్రత్త అంటూ సైబర్ నేరగాళ్ల పట్ల హెచ్చరికలు జారీ చేస్తున్నారు సైబర్ నిపుణులు.

Read more about: credit cards
English summary

రాత్రి వేళల్లో ఆన్ లైన్ లో డబ్బుల లావాదేవీలు చేస్తున్నారా ? అయితే తస్మాత్ జాగ్రత్త !! ఎందుకంటే .. | online money transactions at night? cyber criminals more active, be alert !!

Cybercriminals are more active in the country. Cybercriminals, who have been committing scams through new ways in recent times, are ramping up their dentistry at night, and cyber experts say those who want to make online transfers at night should be vigilant.
Story first published: Thursday, April 15, 2021, 18:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X