Layoff's: కొంపముంచిన మోదీ సర్కార్ పన్ను నిర్ణయం.. 350 ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీ..
Layoff's: ఇటీవల కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు పన్ను విధానంలో మార్పులకు దారితీస్తున్నాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం ఉద్యోగాల కోతలకు దారితీసింది.
గతవారం దేశంలోని ఆన్‌లైన్ గేమింగ్ రంగంపై కేంద్ర ప్రభుత్వం భారీగా జీఎస్టీ పన్నును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఒకేసారి వీటిపై పన్నును 28 శాతం చేయటంతో కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆగస్టు ప్రారంభంలో జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం తర్వాత ప్రముఖ కంపెనీ మొబైల్ ప్రీమియర్ లీగ్ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు సిద్ధమౌతోంది. MPL కంపెనీ విడుదల చేసిన నివేదిక ప్రకారం సుమారు 350 మందికిపైగా ఉద్యోగులను తొలగించేందుకు జాబితాను సిద్ధం చేసింది.

కంపెనీ తన ఉద్యోగులకు అంతర్గతంగా పంపిన మెమో ప్రకారం దాదాపు 350 మందిని తొలగించబోతోందని వెల్లడైంది. దీనికి సంబంధించి MPL సహ వ్యవస్థాపకుడు సాయి శ్రీనివాసన్ ఉద్యోగులకు ఆగస్టు 8న ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఆన్‌లైన్ గేమింగ్‌పై జీఎస్‌టీ రేట్లు పెరగడమే రిట్రెంచ్‌మెంట్‌కు కారణమని ఉద్యోగులకు తెలిపారు. 28 శాతం జీఎస్టీ కారణంగా కంపెనీపై పన్ను భారం 350-400 శాతం పెరిగిందని వెల్లడించింది. ఉద్యోగుల ఖర్చులతో పాటు సర్వర్లు, కార్యాలయ మౌలిక సదుపాయాలు ప్రధాన ఖర్చులుగా ఉన్నట్లు వెల్లడించింది.
తప్పని పరిస్థితుల్లో ఖర్చుల మదింపులో భాగంగా ఉద్యోగుల తొలగింపుల నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ ఉద్యోగులకు వెల్లడించింది. గేమింగ్ పరిశ్రమకు తాజా రేట్లు అక్టోబర్ 1 నుంచి వర్తిస్తాయని నిర్మలా సీతారామన్ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత తెలిపారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని నిరంతరం డిమాండ్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications