Online Gaming Bill: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌లను నియంత్రించే గేమింగ్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి విదితమే. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఈ రోజు పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉండటంతో గేమింగ్ పరిశ్రమలో ఆందోళన నెలకొంది. ఈ బిల్లును నిలిపివేయాలని, లేదా కనీసం సమగ్రంగా పునరాలోచించాలనే కోరుతూ ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ (AIGF), ఈ-గేమింగ్ ఫెడరేషన్ (EGF), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ (FIFS) కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అత్యవసర లేఖ రాసాయి.
ఈ బిల్లును ప్రస్తుత రూపంలో ఆమోదిస్తే.. అధిక ఆదాయం వస్తున్న గేమింగ్ రంగానికి మరణ శాసనం అవుతుందని AIGF హెచ్చరించింది. ముఖ్యంగా స్కిల్-బేస్డ్ రియల్ మనీ గేమ్స్ ఆడే కోట్లాది మంది నిజమైన గేమర్లు నియంత్రణ లేని అక్రమ ప్లాట్‌ఫామ్‌ల వైపు వెళ్లే అవకాశం ఉందని ఆ సంస్థలు హెచ్చరించాయి. పరిశ్రమ నిపుణులు చెబుతున్న లెక్కల ప్రకారం, ఈ బిల్లుతో సుమారు 4 లక్షల కంపెనీలతో పాటుగా 2 లక్షల ఉద్యోగాలు, రూ. 25 వేల కోట్ల పెట్టుబడులు ప్రభావితం అవుతాయని తెలిపారు. ప్రతి ఏటా వచ్చే రూ.20 వేల కోట్ల GST ఆదాయం పెను ప్రమాదంలో పడుతుందని తెలిపారు.
ఈ బిల్లు తుది రూపం ఆన్‌లైన్‌లో బయటకు కావడంతో గేమింగ్ కంపెనీల్లో ఆందోళన మొదలైంది. ఈ చట్టం ఏ రూపంలోనైనా పార్లమెంటులో ఆమోదం పొందితే.. మా కార్యకలాపాలు నిలిపివేయడం తప్ప మాకు మరో మార్గం ఉండదని ప్రముఖ గేమింగ్ కంపెనీకి చెందిన ఒక ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగాయి కానీ.. ఈసారి పరిశ్రమతో ఎటువంటి చర్చలు లేకుండానే ప్రతిపాదన ముందుకు తీసుకు వచ్చినట్లు ఆయన ఆరోపించారు.

ప్రముఖ గేమింగ్ కంపెనీలైన Dream11, MPL, Games24x7, Nazara, Zupee తదితర సంస్థలు ..నైపుణ్య ఆధారిత గేమ్స్ నుంచే ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. పైగా భారత క్రీడలకు స్పాన్సర్‌షిప్ కూడా చేస్తున్నాయి. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు అమల్లోకి వస్తే..వీటన్నింటిపై ప్రభావాన్ని చూపుతుందని కూడా పరిశ్రమ నిపుణులు గుర్తుచేశారు. తెలుగురాష్ట్రాల్లో సహా అనేక రాష్ట్రాలు, నగర స్థాయి టి20 లీగ్‌లు ఫాంటసీ గేమింగ్ సంస్థల అందించే ఫైనాన్షియల్ మద్దతుపైనే ఆధారపడి ఉన్నాయి. గేమింగ్ రంగం కుప్పకూలితే, ఈ లీగ్‌లు కొనసాగడం కష్టమవుతుందని వారు హెచ్చరించారు.
ప్రస్తుత బిల్లు పూర్తిస్థాయి నిషేధం రూపంలో ఉండటం అత్యంత ఆందోళనకరమని ఈ సంస్థలు చెబుతున్నాయి. నిషేధం బదులు కఠినమైన KYC ప్రమాణాలు, లైసెన్సింగ్, ప్రకటన నియంత్రణలు తదితర నియమాలతో నిబంధనలు రూపొందిస్తే.. భారతీయ వినియోగదారులు క్రమబద్ధమైన, భద్రమైన ప్లాట్‌ఫామ్‌లలోనే ఉండగలుగుతారని కంపెనీలు సూచించాయి. UK, US, ఆస్ట్రేలియా తరహా దేశాల నమూనాను భారత దేశం కూడా అనుసరించవచ్చని వారు తెలిపారు.
అంతేకాదు, బిల్లులో ప్రస్తుతం నిర్దిష్ట ప్రణాళిక (transitional plan) లేకపోవడం కూడా పెద్ద లోపంగా పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ఈ రంగంలోని వేల సంఖ్యలో ఉద్యోగులను రక్షించేందుకు, వినియోగదారుల డిజిటల్ వాలెట్లలో ఉన్న బకాయిలను తిరిగి చెల్లించే విధానం రూపొందించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. లేకుంటే చట్టం అమలైన వెంటనే ఈ సేవలు ఒక్కసారిగా మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు సంబంధించి నియంత్రణ లేకుండా నిషేధం చేయడం ద్వారా భారత గేమింగ్ రంగానికి తీరని నష్టాన్ని మిగులుస్తుందని పరిశ్రమ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications