న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒకే తరహా పన్నులు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ - జీఎస్టీ)ను అమల్లోకి తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వేర్వేరు ట్యాక్సులన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చింది. వేర్వేరు పన్నులకు బదులు జీఎస్టీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. పెట్రోల్, డీజిల్, మద్యం వంటి కొన్నింటిని మినహాయిస్తే.. మిగిలినవన్నీ జీఎస్టీ పరిధిలో కొనసాగుతున్నాయి. వాటి ద్వారా ప్రతి నెలా కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా ఆదాయాన్ని చవి చూస్తోంది.

ఎల్లుండి జీఎస్టీ కౌన్సిల్..
ఇప్పటిదాకా గరిష్ఠంగా 1,42,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని అందుకుంది కేంద్ర ప్రభుత్వం. జీఎస్టీ కౌన్సిల్ (GST Council) శుక్రవారం సమావేశం కాబోతోంది. 45వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ ఇది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈ సమావేశానికి నేతృత్వం వహిస్తారు. ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఆర్థికశాఖ మంత్రులు, అధికారులు ఇందులో పాల్గొంటారు. వర్చువల్ విధానంలో సాగుతుందీ భేటీ. న్యూఢిల్లీకి బదులుగా ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సమావేశం ఏర్పాటు కానుంది.

జీఎస్టీ బయటే..
కాగా- పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని వచ్చే అంశాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందంటూ వార్తలొచ్చాయి. జీఎస్టీ పరిధిలో లేదు ఇది. ఫలితంగా- పెట్రోల్, డీజిల్ ధరలపై వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా పన్నులు వసూలవుతున్నాయి. రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని తెచ్చి పెట్టేవి కావడంతో ఒక్కో రాష్ట్రం ఒక్కోలా తమ రాబడికి అనుగుణంగా వాటిపై అమ్మకపు పన్నులు, ఇతర ట్యాక్స్‌లను విధించాయి. వాటి ద్వారా ఖజానాను నింపుకొనే ప్రయత్నం చేస్తోన్నాయి.

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీస్‌పై
ఇక తాజాగా- ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్, మద్యం లాగే- ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలు కూడా ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో లేవు. ఫుడ్ డెలివరీ సేవలపైనా జీఎస్టీ రూపంలో పన్నులను వసూలు చేయాలని భావిస్తోంది. యాప్ మొదలుకుని- ఫుడ్ డెలివరీ వరకు, టేక్ అవే..ఇలా అన్ని రకాల సేవలను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలని కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

కౌన్సిల్‌లో నిర్ణయం..
స్విగ్గి, జొమాటో, ఢిల్లీవరి, ఉబేర్ ఈట్స్, డుంజో, బాక్స్8, స్కూట్సీ, ఫుడ్ పండా, బియాండ్ మెను, ఫ్రెష్ మెను వంటి పలు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా అవి తమ సేవలు, నెట్‌వర్క్‌ను విస్తరించుకున్నాయి. ఆయా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ అందించే సేవలను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని వచ్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసులకు అనుగుణంగా జీఎస్టీ శుక్రవారం నాటి కౌన్సిల్ భేటీలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

కనీసం రూ.2,000 కోట్లు..
జొమాటో వంటి కొన్ని ప్లాట్‌ఫామ్స్ ట్యాక్స్ కలెక్టర్స్ అట్ సోర్స్‌గా రిజిస్టర్ అయి ఉన్నందున.. వాటికి జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదనే అబిప్రాయాలు సైతం వ్యక్తమౌతోన్నాయి. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రాకపోవడం వల్లే ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీ సైతం తన సిఫారసుల్లో పొందుపరిచినట్లు చెబుతున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications