Ayana Renewable: ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ అయానా రెన్యూవబుల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో గణనీయమైన మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు రంగంలోకి దిగింది. భారతదేశంలో అతిపెద్ద క్రూడ్ అండ్ సహజ వాయువు ఉత్పత్తిదారుగా దాని క్లీన్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియోను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో ఓఎన్జీసీ, NTPC గ్రీన్ ఎనర్జీ బెంగుళూరు ఆధారితంగా కొనుగోలు చేయడానికి ఆసక్తి పెరగడంతో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (NIIF) యాజమాన్యంలో ఉన్న అయానా రెన్యూవబుల్ పవర్ కోసం వేలం వేయడానికి కన్సార్టియం ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ONGC- NTPC గ్రీన్ ఎనర్జీ సంయుక్తంగా అయానా రెన్యూవబుల్ కోసం వేలం వేయవచ్చు లేదా ఓఎన్జీసీ ఒంటరిగా పోటీలో నిలవనుందని తెలుస్తోంది.

ఇప్పటికే అయానాను దక్కించుకునేందుకు రేసులో జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ, సెకురా ఎనర్జీ, మస్ధార్, మ్యాక్విర్, సెంబ్ కార్ప్ వంటి సంస్థలో పోటీపడుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ONGC పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు అంకితమైన ఓఎన్జీసీ గ్రీన్‌ని ప్రారంభించింది. అయితే NTPC గ్రీన్ ఎనర్జీ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ కోసం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రెండు కంపెనీలు గతంలో ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం సహకరించుకున్నాయి.
అయానా రెన్యూవబుల్ ఎనర్జీ అనేక రాష్ట్రాల్లో 4 GW కంటే ఎక్కువ సోలార్, విండ్, హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టుల గణనీయమైన పైప్‌లైన్‌ను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్‌లలో 1.3 GW కార్యాచరణ సామర్థ్యంతో, పునరుత్పాదక ఇంధన రంగంలో కంపెనీ ముందుకు దూసుకుపోతోంది.


Click it and Unblock the Notifications