Mukesh Ambani: అంబానీని కోర్టుకు లాగిన ప్రభుత్వ కంపెనీ.. చిక్కుల్లో రిలయన్స్..
Reliance Vs ONGC: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్త చిక్కుల్లో పడింది. ఈ సారి ఏకంగా ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ రంగంలోకి దిగటంతో వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది.
అంబానీకి చెందిన రిలయన్స్ అక్రమంగా గ్యాస్ దొంగిలించిందంటూ ప్రభుత్వ కంపెనీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC) కోర్టును ఆశ్రయించింది. రిలయన్స్ తన ఆధీనంలోని బ్లాక్ నుంచి అక్రమంగా పక్కనే ఉన్న ONGC భూగర్భ గ్యాస్ బ్లాక్‌లోకి బోరింగ్ చేసిందని ఆరోపిస్తూ 2014లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన కన్సల్టింగ్ ఏజెన్సీ కూడా ఈ సమస్యను పరిశీలించింది.

ఓఎన్జీసీ గ్యాస్ క్షేత్రాల నుంచి రిలయన్స్ తన KG-D6 బ్లాక్‌కు రూ.11,000 కోట్ల విలువైన గ్యాస్ తరలిపోయిందని నిర్ధారించినట్లు అమెరికా కన్సల్టింగ్ సంస్థ నిర్థారించింది. ఈ అక్రమానికి పాల్పడినందుకు రిలయన్స్ ప్రభుత్వానికి పరిహారం చెల్లించాలని జస్టిస్ షా కమిటీ సిఫార్సు చేసింది. అయితే 2018లో ఆర్బిట్రేషన్ ప్యానెల్ 1.55 బిలియన్ డాలర్ల పరిహారం కోసం ప్రభుత్వం చేసిన డిమాండ్‌ను తిరస్కరించింది. ఆర్బిట్రేషన్ ఖర్చుగా అంబానీ నేతృత్వంలోని కన్సార్టియంకు 8.3 మిలియన్ డాలర్లను చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం దిల్లీ హైకోర్టులోని సింగిల్ జడ్జ్ బెంచ్‌ను ఈ కేసుపై ఆశ్రయించింది. గతంలో మధ్యవర్తిత్వ తీర్పును రద్దు చేయాలని కోరింది. తద్వారా రిలయన్స్ 1.729 బిలియన్ డాలర్లకు పైగా అన్యాయంగా సంపదను కూడబెట్టిందని కోర్టుకు నివేదించింది. జస్టిస్ అనుప్ జైరామ్ భంభానీ మేలో ఈ అభ్యర్థనను తిరస్కరించినప్పటికీ.. ప్రభుత్వం మళ్లీ దిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసింది. అయితే ఇప్పుడు కోర్టు విచారణకు అంగీకరించింది. ఈ వ్యాజ్యాన్ని ఫిబ్రవరి 12న న్యాయమూర్తులు మన్మోహన్, మినీ పుష్కర్‌న విచారించనున్నారు. ముగిసిపోయిందనుకున్న అధ్యాయం తిరిగి ప్రారంభం కావటంతో రిలయన్స్ గ్రూప్‌కు మళ్లీ తలనొప్పులు మెుదలయ్యాయి.


Click it and Unblock the Notifications