ఇప్పుడు రోజు డిజిటల్ చెల్లింపులు మన జీవనశైలిలో భాగమయ్యాయి. చిన్నపాటి కొట్టు దగ్గర రూ.30 చెల్లించాలన్నా, మిత్రునికి రూ. 3000 పంపాలన్నా మొబైల్ ఫోన్‌లోని యూపీఐయే దారి చూపుతోంది. ఈ సౌకర్యం ఎంత వరకూ మేలు చేస్తుందో, అదే రీతిలో అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం కూడా తెచ్చిపెడుతుంది. రోజురోజుకూ పెరిగే సైబర్ మోసాలు, ఫేక్ లింకులు, OTP దొంగతనాలు మనకు మించినవే. అలాంటి ఈ తరుణంలో మన డబ్బుకు గట్టిగా కాపలా వహించే సరళమైన మార్గదర్శకాలను అందించింది NPCI(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా).

ఈ సంస్థ దేశవ్యాప్తంగా యూపీఐ, రూపే, నెఫ్ట్ లాంటి పేమెంట్ వ్యవస్థలను అమలు చేస్తూ, వినియోగదారుల భద్రతను మొదటి ప్రాధాన్యతగా చూస్తోంది. అందుకే, NPCI రూపొందించిన డిజిటల్ చెల్లింపుల భద్రతకు సంబంధించిన ఐదు కీలక సూచనలు, ప్రతి ఒక్కరిని మోసాల నుండి కాపాడగలిగేలా నిలుస్తున్నాయి.
డిజిటల్ భద్రత ఎందుకు అవసరం?
ఇప్పటి రోజుల్లో మన దేశం డిజిటల్ చెల్లింపులలో అతివేగంగా పురోగతిని చూపుతోంది. మొబైల్ ఫోన్‌లో కొన్ని క్లిక్స్‌తోనే వేల రూపాయల లావాదేవీలు జరిగిపోతున్నాయి. ముఖ్యంగా యూపీఐ వచ్చాక అయితే చిన్నచిన్న దుకాణాల నుండి, పెద్ద వ్యాపారాల వరకు నగదు లావాదేవీలకు బదులుగా డిజిటల్ పేమెంట్లే ఎక్కువగా వాడుతున్నారు.
ఉదాహరణకు: కేవలం జూన్ నెలలోనే, యూపీఐ ద్వారా 18.4 బిలియన్ లావాదేవీలు జరిగాయి. వాటి మొత్తం విలువ రూ. 24 లక్షల కోట్లు. ఇది ఎంత పెద్ద సంఖ్యో ఊహించగలిగితేనే తెలుస్తుంది. ఇంత వాడకం ఉన్న యూపీఐ సేవలకు ఇప్పటికే 500 మిలియన్ (50 కోట్ల) యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీరందరూ తమ లావాదేవీలు సురక్షితంగా జరగాలంటే జాగ్రత్తలు తప్పనిసరి. అందుకే, డిజిటల్ చెల్లింపులు ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో, అదే రీతిలో మన భద్రతపై దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా పెరిగింది.
NPCI సూచించిన 5 సురక్షిత డిజిటల్ చెల్లింపు చిట్కాలు:
1. మీ ఫోన్‌కి వచ్చిన ఏ QR కోడ్ అయిన చూసిన వెంటనే స్కాన్ చేసి చెల్లించకండి. ముందు లబ్ధిదారుని పేరు, పేమెంట్ అమౌంట్ అన్ని బాగా పరిశీలించండి. ఒక్క చిన్న చెల్లింపు అని చేయించుకునేందుకు చెల్లించాల్సిన రూ. 200ను రూ. 20,000గా మార్చేసే దాకా మోసాలు జరుగుతున్నాయి.
2. "మీ ఖాతాలో నుంచి ఒకవేళ ఈ డబ్బు చెల్లించాలి అని ఈ లింక్ క్లిక్ చేయండి'' అనే మెసేజ్‌లు చాలా మందికి వస్తుంటాయి. వాటిని నిజంగా బ్యాంకు పంపలేదని మనకు తెలిసినా, భయం లేదా అయోమయం వల్ల లింక్ క్లిక్ చేస్తాం. కానీ అదే మీ ఖాతాలో డబ్బు మాయమయ్యే తొలి దశ అవుతుంది. ఏ మెసేజ్ అయినా ముందుగా ఆలోచించండి. అవసరమైతే బ్యాంకుకే స్వయంగా ఫోన్ చేయండి. వివరాలని కన్నుకొని అప్పుడు ఒకవేళ అది నిజమైతే అప్పుడు చేయండి.
3. ''మీ పేమెంట్ పూర్తి చేయాలంటే ఒక చిన్న వెరిఫికేషన్ కావాలి, దయచేసి పిన్ చెప్పండి'' అని ఫోన్‌లో అడిగే వారుండోచ్చు. కానీ గుర్తుంచుకోండి బ్యాంక్, NPCI, ప్రభుత్వ సంస్థ, లేదా పోలీస్ శాఖ వంటి సంస్థలు ఎప్పుడూ పిన్ అడగవు. మీ ఫోన్‌కి వచ్చిన OTP కూడా ఎవరికీ చెప్పకండి అది చెప్తే దానితో పాటు మీ డబ్బు కూడా వెళ్లిపోతుంది.
4. మీరు ఎవరికైనా డబ్బు పంపేముందు, కనీసం ఒక్కసారి అతని పేరు లేదా వ్యాపార వివరాలు మీ స్క్రీన్‌లో కనిపిస్తున్నాయా అని ధృవీకరించండి. QR కోడ్ అయినా, యూపీఐ ఐడీ అయినా, ఆన్‌లైన్ పేమెంట్ అయినా ఒక చిన్న జాగ్రత్త పెద్ద మోసం నుంచి కాపాడుతుంది. మోసగాళ్లు తరచుగా అవసరంగా ఇప్పుడే చెల్లించండి అనే ఒత్తిడిని కలిగిస్తారు. మీరు అలాంటి వాటికి గురికాకుండా గట్టిగా వాళ్ళతో మాట్లాడండి.
5. అన్ని లావాదేవీలకు SMSలు లేదా యాప్ నోటిఫికేషన్లు ఎన్‌ఎబుల్ చేసి ఉంచండి. ఎప్పుడైనా మీరు డిజిటల్ పేమెంట్ చేసిన వెంటనే, మీ ఫోన్‌కి వచ్చిన మెసేజ్ లేదా నోటిఫికేషన్‌ను చూస్తూ ఉండండి. అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే వెంటనే బ్యాంక్ లేదా యూపీఐ యాప్ కస్టమర్ కేర్‌ను సంప్రదించండి. ఎక్కువమంది దీన్ని ఊరుగా తీసుకొని, మోసాలు చేయడానికి ప్రయత్నిస్తారు. ముందుగానే జాగ్రత్త పదండి. ఆ మోసం జరిగిన తరువాతే ఎంత మొత్తుకున్నా ఏం లాభం లేకుండా పోతుంది.
మీరేమైనా డిజిటల్ లావాదేవీలలో మోసపోయారని అనుమానం వస్తే, వెంటనే తెలియజేయండి. ఏ ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైం హెల్ప్‌లైన్ నెంబర్ 1930 కు కాల్ చేయండి లేదా సంచార శాఖ అధికారిక వెబ్‌సైట్ sancharsaathi.gov.in ను సందర్శించండి. మోసానికి సంబంధించిన మెసేజ్‌లు, స్క్రీన్‌షాట్లు, చాట్ డీటెయిల్స్ లాంటివన్నీ సేవ్ చేయండి. ఇవి అధికారుల దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారతాయి. మీరు వెంటనే చర్య తీసుకుంటే, ఆర్థిక నష్టం నుంచి తప్పించుకునే అవకాశం పెరుగుతుంది.
మీరు ఈ సూచనలు అనుసరిస్తే, మోసాల నుంచి దూరంగా ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్రమత్తత, సరైన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే మనం భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ చెల్లింపు వ్యవస్థను మరింత సురక్షితంగా, ఆత్మవిశ్వాసంతో, మరియు సౌకర్యంగా వినియోగించగలుగుతాము.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications