నెగటివ్ బ్యాలెన్స్ ఉన్న ఖాతాను మూసేయెుచ్చా..?? ఏ జాగ్రత్తలు పాటింటాలంటే..
Banking News: సేవింగ్స్ ఖాతాను మూసివేయటం గురించి మనలో చాలా అనుమానాలు ఉంటుంటాయి. ప్రధానంగా ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉండేవారు ఇవి తెలుసుకోవాలి. తరచుగా ఉద్యోగాలు మారటం వల్ల కూడా ఇలాంటి సమస్య ఎదురవుతుంటుంది.
అకౌంట్ క్లోజ్ చేసుకోవాలని నిర్ణయించినప్పుడు ఖాతాలో ఏవైనా పెండింగ్ లావాదేవీలు ఉన్నాయో లేదో ముందుగా తనిఖీ చేసుకోవాలి. ఖాతాలో డిపాజిట్లు, ఉపసంహరణలు, చెక్కుల లావాదేవీలు పెండింగ్‌లో ఉన్నట్లయితే ముందుగా వాటిని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించనుందుకు సేవింగ్స్ ఖాతాలో నెగిటివ్ బ్యాలెన్స్ ఉన్నట్లయితే దానిని ముందుగా సెటిల్ చేయాల్సి ఉంటుంది.

మూసేయాలనుకుంటున్న సేవింగ్స్ ఖాతాకు లింక్ చేయబడిన డెబిట్ ఆదేశాలను మరొక ఖాతాకు బదిలీ చేయాలి. పొదుపు ఖాతాకు లింక్ చేయబడిన EMI, బిల్లులు, నెలవారీ సబ్‌స్క్రిప్షన్స్, SIP వంటి స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ లేదా ఆటోమేటెడ్ క్లియరెన్స్‌లను ముందుగా మరొక ఖాతాకు బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది లోన్ EMIలో డిఫాల్ట్‌ను నివారించి.. క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం కాకుండా నిరోధించవచ్చు. అలాగే బ్యాంక్ ఖాతాకు బ్యాంక్ లాకర్ అద్దె చెల్లింపులు లింక్ చేసిఉన్నట్లయితే.. రాబోయే అద్దె చెల్లించేందుకు కొత్త ఖాతాను వినియోగించుకునేందుకు అనుమతిస్తే సేవింగ్స్ ఖాతాను క్లోజ్ చేసేందుకు బ్యాంకు అనుమతినిస్తుంది.
వినియోగించని బ్యాంక్ ఖాతాలను క్లోజ్ చేయవచ్చు. అయితే కొత్త ఖాతాలను బ్యాంక్ నిర్థేశించిన గడువు కంటే ముందే మూసేయాలనుకుంటే అందుకు రూ.500 వరకు జరిమానా వసూలు చేస్తాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) లేదా బీమా పాలసీల వంటి వివిధ ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడులు పెట్టేవారు లింక్ చేసిన పాత అకౌండ్ మూసివేసినప్పుడు కొత్త ఖాతా వివరాలను అందించాలి. మ్యూచువల్ ఫండ్ ఖాతాదారులు సైతం ఇదే పద్ధతిని పాటించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications