August Bank Holidays: ఆగస్టులో 13 రోజులు బ్యాంక్స్ సెలవులు, తప్పక తెలుసుకోండి
Bank Holidays 2024: నేటితో కొత్త నెలలోకి ప్రవేశించినందున ప్రజలు ఆగస్టు నెలలో దేశంలోని బ్యాంకులు సెలవు గురించి శోధిస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంక్ శాఖలను సందర్శించటానికి ముందు ప్రతి ఒక్కరూ తప్పకుండా వాటి నిర్థిష్ట సెలవు దినాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాల్సిందే.
మీకు ఆగస్టు నెలలో ఏదైనా బ్యాంక్ పనిని పూర్తి చేసేందుకు చూస్తున్నట్లయితే ఈ వార్త తప్పకుండా మీకోసమే. ఈ నెలలో వరుస పండుగలతో పాటు నేషనల్ హాలిడే ఉండటం కారణంగా బ్యాంకులు ఎక్కువ రోజులు సెలవులో ఉండనున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం నుంచి జన్మాష్టమితో సహా ఆగస్టులో అనేక పండుగలు ఉన్నాయి. దీంతో దాదాపు 13 రోజుల పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు సెలవులో ఉండనున్నాయి. వీటిలో రెగ్యులర్ శనివారం, ఆదివారం సెలవులు కూడా ఉన్నాయి. ఈ సెలవులు ఆర్బీఐ క్యాలెండర్ ఆధారంగా నిర్ణయించబడతాయి. ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు వర్తిస్తాయి.

ఆగస్టు మాసంలో దేశంలోని బ్యాంక్ సెలవులు:
* ఆగస్టు 3 (శనివారం) - కేర్ పూజ - అగర్తలాలో బ్యాంకులకు సెలవు
* 4 ఆగస్టు (ఆదివారం) - వారపు సెలవు.
* ఆగస్టు 8 (గురువారం) - సిక్కింలోని టెండాంగ్ లో రమ్ ఫాట్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.
* 10 ఆగస్టు (శనివారం) - రెండవ శనివారం.
* ఆగస్టు 11 (ఆదివారం) - వారపు సెలవు.
* 13 ఆగస్టు (మంగళవారం) - పేట్రియాట్ డే - మణిపూర్‌లో బ్యాంకులు మూతబడతాయి.
* 15 ఆగస్టు (గురువారం)- స్వాతంత్ర్య దినోత్సవం/పార్సీ నూతన సంవత్సరం- భారతదేశంలో అన్ని బ్యాంకులకు సెలవు.
* 18 ఆగస్టు (ఆదివారం) - వారపు సెలవు.
* 19 ఆగష్టు - (సోమవారం) - రక్షా బంధన్ / ఝులానా పూర్ణిమ / బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ పుట్టినరోజు - త్రిపుర, గుజరాత్, ఒరిస్సా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి.
* ఆగస్ట్ 20 - (మంగళవారం) - శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవుదినం.
* ఆగష్టు 24 (శనివారం) - నాల్గవ శనివారం.
* 25 ఆగస్టు (ఆదివారం) - వారపు సెలవు.
* 26 ఆగస్టు-(సోమవారం)- జన్మాష్టమి కారణంగా గుజరాత్, ఒరిస్సా, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, బెంగాల్, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, జార్ఖండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లలో ఈ రోజున మూసివేత ఉంది.
వాస్తవానికి పైన పేర్కొన్న సెలవు రోజుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు, ఏటీఎం సేవలు వంటి డిజిటల్ సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయి. అయితే ఏదైనా రుణానికి సంబంధించి, గోల్డ్ లోన్, అగ్రి లోన్, ఏవైనా డాక్యుమెంట్లు సమర్పించటం లేదా తిరిగి పొందటం, ఇతర అవసరాల కోసం ఖచ్చితంగా బ్యాంకులను సందర్శించాల్సిన పరిస్థితి ఏర్పడితే చివరి నిమిషంలో గందరగోళానికి గురికాకుండా ఆర్బీఐ నిర్థేశించిన సెలవు దినాల వివరాలను ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవటం ఉత్తమం. వీటి వివరాలను ఖాతాదారులు తమకు దగ్గరలోని బ్యాంక్ శాఖను సందర్శించినప్పుడు అడిగి తెలుసుకోవచ్చు. లేదా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ సందర్శించం ద్వారా కూడా సెలవుల వివరాలను పొందవచ్చు.


Click it and Unblock the Notifications