One Point One Solutions: దీర్ఘకాలంలో పెట్టుబడిదారులకు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు మల్టీబ్యాగర్ రాబడులను ఇస్తాయని మరోసారి నిరూపితమైంది. ఐటీ సేవల రంగంలోని ఎస్ఎమ్ఈ కంపెనీ సూపర్ లాభాలను అందించి ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. రాత్రికి రాత్రే స్టాక్ మార్కెట్లు ఎవ్వరినీ ధనికులుగా మార్చలేవని అయితే అందుకు ఓపిక అవసరమని వన్ పాయింట్ వన్ సొల్యూషన్ కంపెనీ షేర్లు నిరూపించాయి.
వాస్తవానికి ఈ కంపెనీ డిసెంబర్ 2017లో ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అరంగేట్రం చేసింది. ఆ సమయంలో కంపెనీ ఒక్కో షేరును రూ.65-67 రేటు వద్ద రిటైల్ పెట్టుబడిదారులకు ఇష్యూ చేసింది. ఆ సమయంలో కంపెనీ షేర్లు ఏకంగా 20 శాతం ప్రీమియం ధర వద్ద మార్కెట్లో జాబితా అయ్యాయి. ఆ సమయంలో ఒక లాట్ షేర్లను కొనుగోలు చేసేందుకు రూ.1.34 లక్షలు వెచ్చించి లాభాల స్వీకరణను వెళ్లకుండా ఇప్పటి వరకు పెట్టుబడిని కొనసాగించిన ఇన్వెస్టర్లకు భారీ లాభాల బహుమతి లభించింది. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం కంపెనీలో లాట్ షేర్ల మార్కెట్ విలువ రూ.12.15 లక్షలకు చేరుకుంది. అయితే ఇందుకోసం ఏకంగా 7 ఏళ్లు పట్టింది. ఎవరైనా పెట్టుబడిదారులు ఐపీవోలో పెట్టుబడి పెట్టిన మెుత్తాన్ని బ్యాంక్ ఎఫ్ డిలో పెట్టిఉంటే డబ్బు డబుల్ అయి ఉండేది.

గడచిన ఏడేళ్ల కాలంలో మల్టీబ్యాగర్ ఐపీవో కంపెనీ తన విలువైన పెట్టుబడిదారులకు రెండుసార్లు 1:2 నిష్పత్తిలో బోనస్ షేర్లను అందించింది. అలాగే ఒకసారి 1:5 నిష్పత్తిలో స్టాక్ స్పిట్ ప్రకటించింది. ఈ ఎస్ఎమ్ఈ స్టాక్ 1:2 బోనస్ షేర్ల జారీతో 25 ఏప్రిల్ 2019, 19 జనవరి 2022న ఎక్స్-బోనస్‌గా ట్రేడ్ చేయబడింది. ఐపీవోలో 2000 షేర్లు కూడిన ఒక లాట్ షేర్లను కొన్న ఇన్వెస్టర్లు బోనస్ షేర్ల ప్రకటన తర్వాత 4500 షేర్లను కలిగి ఉన్నారు. తర్వాత జనవరి 19, 2022లో జరిగిన స్టాక్ స్పిట్ వల్ల ఈ షేర్ల సంఖ్య ఏకంగా 12,500కి చేరుకుంది. ఈ షేర్లు ప్రస్తుత మార్కెట్ ధర ఒక్కోటి రూ.54 చొప్పున మార్కెట్ విలువ రూ.12.15 లక్షలకు చేరుకుంది.
ఇటీవల కంపెనీ క్లయింట్ల సముపార్జనతో వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ పేరు వార్తల్లో నిలిచింది. కంపెనీ యూరోపియన్ ప్రాంతం నుంచి కొత్త క్లయింట్ ను పొందింది. వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ దాని అనుబంధ సంస్థ ITCube సొల్యూషన్స్ అత్యాధునిక AI ఆధారిత సాధనాల ద్వారా బ్రాండ్ బెదిరింపులను ఎదుర్కోవడంలో ప్రత్యేకత కలిగిన ప్రముఖ గ్లోబల్ క్లయింట్‌ను గెలుచుకున్నట్లు ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.
More From GoodReturns

ఇన్వెస్టర్లు డబ్బులతో రెడీగా ఉండండి.. దేశ చరిత్రలోనే అతిపెద్ద IPO..రూ. 20 వేల కోట్ల టార్గెట్‌తో వస్తున్న NSE.

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!



Click it and Unblock the Notifications