For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 లక్షలమంది క్రెడిట్ కార్డు వివరాలు లీక్

|

ప్రముఖ పిజ్జా బ్రాండ్ డామినోస్ సర్వర్ల నుండి భారీగా డేటా లీక్ అయింది. ఇజ్రాయెల్‌కు చెందిన కో-ఫౌండర్ అండ్ సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ హడ్సన్ రాక్, అలోన్ గాల్ చేసిన ట్వీట్స్ ప్రకారం ఈ డేటా సామర్థ్యం 13 టెరాబైట్లు. డేటాలో పది లక్షల యూజర్ల క్రెడిట్ కార్డు వివరాలతో సహా 18 కోట్ల మిలియన్ల ఆర్డర్స్ వివరాలు ఉన్నాయని ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ డేటా మొత్తం డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉన్నట్లు తెలిపారు.

జుబిలాండ్ ఫుడ్ వర్క్స్... డొమినోస్ ఇండియా మాతృసంస్థ. 250 మంది డొమినోస్ ఉద్యోగుల డేటా లీక్ అయింది. ఈ డేటా మొత్తాన్ని 5,50,000 డాలర్లకు అమ్మకానికి పెట్టినట్లు అలోన్ గాల్ పేర్కొన్నారు. ఈ డేటా లీక్ ఆరోపణలను డామినోస్ పేరెంట్ కంపెనీ అయిన జుబిలాంట్ ఫుడ్ వర్క్స్ ఖండించలేదు. కానీ ఫైనాన్షియల్ డేటా లీక్ అయిందనే వార్తలను కొట్టిపారేసింది. జుబిలాంట్ ఫుడ్ వర్క్స్ ఇటీవల సమాచార భద్రతా సమస్యను ఎదుర్కొంది. హ్యాకర్లు చేతికి చిక్కిన క్రెడిట్ కార్డ్ డేటా మొత్తం భారతీయ వినియోగదారులదే.

One million credit cards of Dominos Pizza customers

తమ నిబందనల ప్రకారం వినియోగదారుల ఆర్థిక వివరాలు లేదా క్రెడిట్ కార్డు డేటాను తాము ఎప్పుడు స్టోర్ చేయలేమని, అందుకే డేటా లీక్ అయ్యే అవకాశమే లేదని జుబిలాంట్ ఫుడ్ వర్క్స్ తెలిపింది. ప్రస్తుతం దీనిపై తమ దర్యాప్తు కొనసాగుతుందన్నారు. 10 లక్షలకు పైగా యూజర్ల క్రెడిట్ కార్డుల వివరాలు లీక్ కావడం ఆందోళన కలిగిస్తోంది.

English summary

10 లక్షలమంది క్రెడిట్ కార్డు వివరాలు లీక్ | One million credit cards of Domino's Pizza customers

Domino's India is said to have fallen victim to a major data leak wherein the credit card details of around 10 lakh of its customers and employees have been leaked on the Dark Web.
Story first published: Wednesday, April 21, 2021, 11:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X