ఐఫోన్ 17 ఇండియాలో అంత రేటా.. బయటి దేశాల నుంచి తెప్పించుకోవడం బెటరా.. ఎందుకంత రేటు?
ఐఫోన్ అంటే క్రేజ్ వేరే లెవెల్! కొత్త మోడల్ వస్తే మన దగ్గర లైన్లు పడతాయి, సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ అవుతాయి. కానీ అసలు విషయం ఏంటంటే ఇండియాలో ఐఫోన్ ధర దాదాపు అన్ని దేశాల కంటే ఎక్కువ. తాజాగా వచ్చిన రిపోర్ట్ ప్రకారం "ఐఫోన్ 17 Pro" (256GB) ఇండియాలో రూ. 1,34,900. ఇప్పుడు అదే ఫోన్ జపాన్‌లో కొనేస్తే? కేవలం రూ. 91,200. అదే ఫ్రాన్స్‌లో అయితే ఇంకా తక్కువ రూ.89,000 మాత్రమే.

ఎక్కడ ఎంత?
ఒకే ఐఫోన్ ధర దేశానికోలా ఎంత తేడా ఉంటుందో చూసి షాక్ అవుతారు. ఇండియాలో మాత్రం ఐఫోన్ రూ. 1,34,900 అంటే వరల్డ్ వైడ్‌లోనే అత్యధిక ధర. UAEలో అదే ఫోన్ రూ. 1,27,306, అమెరికాలో రూ. 1,24,417, యూకేలో రూ. 1,15,395. చైనాలో ఇది కాస్త తక్కువగా రూ. 1,12,849, ఆస్ట్రేలియాలో రూ. 1,07,946, జర్మనీలో రూ. 97,811, కెనడాలో రూ. 97,539. కానీ జపాన్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో మాత్రం ధరలు చాల తక్కువ. జపాన్‌లో రూ. 91,200, ఫ్రాన్స్‌లో కేవలం రూ. 89,000. అంటే మన దగ్గర ఒక ఐఫోన్ కొంటే, అక్కడ రెండు ఫోన్లు కొనేసే అవకాశం ఉంది అన్నమాట.
ఇండియాలోనే ఎందుకు ఎక్కువ?
మన దగ్గర ఐఫోన్ ధరలు ఎక్కువగా ఉండడానికి మెయిన్ రీజన్ ఇంపోర్ట్ టారిఫ్స్ + GST. యాపిల్ ఇండియాలో అసెంబ్లింగ్, కొంతమేరకు మాన్యుఫాక్చరింగ్ మొదలుపెట్టింది కానీ, ఇంకా ఎక్కువ మోడల్స్ డైరెక్ట్‌గా విదేశాలనుంచి ఇంపోర్ట్ అవుతాయి.
ఇక ఇంపోర్ట్ అవుతున్నాయి అంటే, దానిపై ప్రభుత్వానికి పేమెంట్ చేయాల్సిన ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుంది. దానికి జోడీగా GST కూడా పడుతుంది. ఈ రెండూ కలిపేసరికి, ఫోన్ అసలు ధరకు 20-25% వరకు అదనంగా వెచ్చించాల్సి వస్తుంది.
ఉదాహరణకి, జపాన్‌లో ఒక ఐఫోన్ ధర రూ. 91,000 ఉంటే, అదే ఫోన్ మన దగ్గర రూ. 1.34 లక్షలు అవుతుంది. ఇంత డిఫరెన్స్ రావడానికి కారణం టాక్స్, టారిఫ్ లెక్క.
యాపిల్ ఇండియాలో ప్రొడక్షన్ ఇంకా ఎక్కువ చేస్తే, కాస్త రేట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రెజెంట్‌గా చూస్తే, "ఐఫోన్ కొంటే మనం టెక్నాలజీని మాత్రమే కాదు, టాక్స్‌లను కూడా కొనుగోలు చేస్తున్నాం" అన్నమాట.
మన దగ్గర ఐఫోన్ అంటే ఒక లగ్జరీ సింబల్. ఎవరైనా కొత్త ఐఫోన్ కొంటే, వెంటనే "వావ్!" అనిపించేలా ఉంటుంది. కానీ జపాన్, ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాల్లో సీన్ మాత్రం డిఫరెంట్. అక్కడ ఐఫోన్ ఒక మిడ్-రేంజ్ ఫోన్‌లా భావిస్తారు. ఉదాహరణకి, జపాన్‌లో ఐఫోన్ ధర మన దగ్గర ఉన్న హై-ఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్లకు దగ్గరగా ఉంటుంది. అందుకే వాళ్లకు ఇది స్పెషల్‌గా అనిపించదు, కేవలం వాడుకోవడానికి సింపుల్ ఫోన్‌లా ఉంటుంది. కానీ ఇండియాలో మాత్రం ఐఫోన్ కొనగలగడం అంటే ఒక పెద్ద స్టేటస్, లైఫ్‌స్టైల్ అప్‌గ్రేడ్ అన్నమాట.
ఇండియాలో ఐఫోన్ ధర ఎక్కువగానే ఉంటుంది. దానికి సొల్యూషన్‌గా చాలామంది గ్రే మార్కెట్ లేదా గల్ఫ్ రూట్‌ను ఆశ్రయిస్తారు. ఉదాహరణకి, UAE, అమెరికా లాంటి దేశాల్లో ఐఫోన్ ధర ఇండియా కంటే చాలా తక్కువ. అందుకే చాలా మంది అక్కడి నుంచి కొనిపించడం లేదా NRI ఫ్రెండ్స్, రిలేటివ్స్ ద్వారా తెప్పించుకోవడం చేస్తారు. గిఫ్ట్‌గా తెప్పించుకోవడం కూడా ట్రెండ్ అయిపోయింది. "అక్కడ 20-30 వేల తక్కువుంటే, అక్కడ తీసుకోవడమే బెటర్ అని అక్కడ నుండి తెప్పించుకుంటారు.
ఐఫోన్ ధర పెరిగినా, ఇండియన్ యూజర్స్ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. EMI సిస్టమ్, ఎక్స్చేంజ్ ఆఫర్స్, క్యాష్‌బ్యాక్‌ల వల్ల ఎవరైనా కొత్త ఐఫోన్ కొనడం ఈజీ అయిపోయింది. చాలామంది పాత ఫోన్ ఇచ్చేసి, EMIలో కొత్త ఐఫోన్ తీసుకోవడమే ట్రెండ్. అంతేకాదు, ఇండియాలో ఇంకా చాలా మందికి ఐఫోన్ అంటే ఒక స్టేటస్ సింబల్. "ఐఫోన్ వాడుతున్నాడు అంటే లైఫ్ సెటయ్యింది" అన్న భావన బలంగా ఉంది. అందుకే ధర ఎంత పెరిగినా డిమాండ్ మాత్రం డౌన్ కావడం లేదు.
యాపిల్‌కి ఇండియా ఒక హాట్ మార్కెట్‌గానే ఉంది. కానీ కస్టమర్లకి మాత్రం"అదే ఫోన్ జపాన్‌లో తక్కువ, మన దగ్గర ఎక్కువ" అనే ఫీలింగ్ మాత్రం తప్పట్లేదు.


Click it and Unblock the Notifications