ఒకే రోజులో 7 శాతం జంప్… సాఫైర్, దేవ్యానీ, జూబిలెంట్ షేర్లకు స్టాక్ మార్కెట్లో ఏం మ్యాజిక్ జరిగిందో తెలుసా?

భారత్‌లో ఫుడ్ & బేవరేజెస్ రంగానికి జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న తాజా నిర్ణయం ఊపిరిపోసింది. ముఖ్యంగా క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ (QSRs)‌కి ఇది పెద్ద పాజిటివ్‌గా మారింది. గురువారం స్టాక్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే "సాఫైర్ ఫుడ్స్, దేవ్యానీ ఇంటర్నేషనల్, జూబిలెంట్ ఫుడ్స్" షేర్లు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. కారణం UHT పాలు, పనీర్, ఇండియన్ బ్రెడ్‌లు, పరోటాల పై జీఎస్టీని 5% నుంచి జీరోకి తగ్గించడం.

QSR amp amp GST cut Quick Service Restaurants QSR Sapphire Foods Devyani International Jubilant Foods stock rally tax reduction food amp amp beverages sector consumer relief market cap

మార్కెట్‌లో క్యూఎస్ఆర్ షేర్ల జోరు

సాఫైర్ ఫుడ్స్
KFC, పిజ్జా హట్ లాంటి బ్రాండ్స్‌ను ఆపరేట్ చేసే సాఫైర్ ఫుడ్స్ షేర్ గురువారం బాగానే రాణించింది. ఒక్క రోజులోనే 7.36% పెరిగి రూ. 347కి చేరింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా దాదాపు రూ.10,552 కోట్లుకి చేరింది. అంటే ఇన్వెస్టర్ల విశ్వాసం ఈ స్టాక్ మీద పెరిగిందని క్లియర్‌గా చెప్పొచ్చు.

దేవ్యానీ ఇంటర్నేషనల్
ఇది యమ్ బ్రాండ్స్‌కి (KFC, పిజ్జా హట్, టాకో బెల్) భారత్‌లో అతిపెద్ద ఫ్రాంచైజీ. షేర్ ప్రైస్ రూ. 182.60 కి చేరింది, అంటే 4.34% లాభం వచ్చింది. దీని వల్ల కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 22,199 కోట్లు దాటింది. QSR రంగంలో దేవ్యానీకి ఉన్న రీచ్, బ్రాండ్ విలువ కారణంగా ఇన్వెస్టర్లు దీన్ని ఇంకా బలంగా చూస్తున్నారు.

జూబిలెంట్ ఫుడ్స్
డొమినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కి మాస్టర్ ఫ్రాంచైజీగా ఉన్న జూబిలెంట్ ఫుడ్స్ కూడా వెనుకబడలేదు. షేర్ 4.54% పెరిగి రూ. 663.60కి చేరింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 43,219 కోట్లుకి చేరి మరింత బలపడింది. డొమినోస్ పాపులారిటీ, QSR స్పేస్‌లో గ్రోత్ పోటెన్షియల్ ఈ కంపెనీకి ఎప్పుడూ అదనపు బలం ఇస్తున్నాయి.

బుధవారం జరిగిన సమావేశంలో యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ పన్ను నిర్మాణంలో కీలకమైన మార్పులను ఆమోదించింది. ఈ మార్పుల్లో ప్రధానంగా పన్ను స్లాబ్స్ సంఖ్యను తగ్గించడం, గృహ వినియోగదారులు, మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారాలపై ఉన్న పన్ను భారాన్ని తగ్గించడం, అలాగే పన్ను చెల్లింపుల కంప్లయన్స్ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేసారు. దీని వల్ల ప్రజలకు కొంత ఆర్థిక ఊరట లభించడంతో పాటు వ్యాపారాలకు కూడా సౌకర్యం కలగనుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇది కేవలం క్యూఎస్ఆర్ కంపెనీలకే కాకుండా, కస్టమర్లకూ సూపర్ న్యూస్. పిజ్జా, బర్గర్ లేదా పరాటా ఆర్డర్ చేస్తే, ఇకపై చవకగా దోరుకుతాయి. ఖర్చు తగ్గితే వినియోగం పెరుగుతుంది. వినియోగం పెరిగితే, కంపెనీల రివెన్యూ పెరుగుతుంది. ఇదే లాజిక్ మార్కెట్‌లో షేర్ల ర్యాలీకి కారణం అయ్యింది.

ఫుడ్ ఇండస్ట్రీ అనలిస్టుల మాటల్లో "ఈ జీఎస్టీ కట్ వల్ల క్యూఎస్ఆర్ సెక్టార్ మళ్లీ బలపడుతుంది. వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. చిన్న పట్టణాల్లో కూడా క్యూఎస్ఆర్ చైన్‌లకు డిమాండ్ వస్తుంది" అని చెబుతున్నారు.

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది కేవలం ఫుడ్ ఇండస్ట్రీకే కాదు, స్టాక్ మార్కెట్ మొత్తానికి పాజిటివ్ సిగ్నల్. గడిచిన కొన్ని నెలలుగా QSR కంపెనీలకు ముడి సరుకుల ధరలు పెరగడం, వినియోగదారుల ఖర్చులు తగ్గడం వంటివి పెద్ద సవాళ్లుగా మారాయి. కానీ ఇప్పుడు జీఎస్టీ రిలీఫ్ రావడంతో సెక్టార్‌లో తిరిగి వృద్ధి కనిపించే అవకాశం ఉంది. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం ఫుడ్ ప్రేమికుల జేబుకి లైట్, రెస్టారెంట్ కంపెనీల షేర్లకి హెవీ లాభం తెచ్చింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+