ఒక్క ఫ్లాట్‌కి రూ. 52 కోట్లు? ఎవరు కొన్నారో తెలుసుకుంటే షాక్ అవుతారు....

ఒకప్పుడు ఫుడ్ డెలివరీ స్టార్టప్‌గా మొదలై, ఇప్పుడు బిలియన్స్ వ్యాల్యూషన్ కంపెనీగా ఎదిగిన జోమాటో వ్యవస్థాపకుడు డీపిందర్ గోయల్ తాజాగా తన వ్యక్తిగత జీవితంలో ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్‌ ది కామెలియాస్‌ అనే అత్యంత ప్రీమియం ప్రాజెక్టులో ఆయన రూ. 52 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు.

Deepinder Goyal house Zomato CEO apartment Gurugram DLF Camellias flat Rs 52 crore luxury home Gurgaon real estate Zomato founder luxury lifestyle

డీఎల్‌ఎఫ్‌ ది కామెలియాస్‌ అనేది భారతదేశంలో అత్యంత ఖరీదైన గృహ సముదాయాల్లో ఒకటి. ఇక్కడ నివాసముంటే, అది ఒక విలాసవంతమైన హోటల్లో ఉండటమే అని అంటారు కొనుగోలు చేసిన వారు. హెలిప్యాడ్ స్థాయి సదుపాయాలు, ప్రైవేట్ క్లబ్, స్పా, సర్వీసులు ఇవన్నీ ఈ ప్రాజెక్ట్‌ను ఓ వేరే లెవల్‌కు తీసుకెళ్తాయి. డీపిందర్ గోయల్ ఎంచుకున్న అపార్ట్‌మెంట్ చుట్టూ సుమారు 10,800 చదరపు అడుగుల విస్తీర్ణంతో, ఐదు పార్కింగ్ స్థలాలతో, లగ్జరీకి మించిన లగ్జరీగా నిలుస్తుంది. దీపిందర్ గోయల్ కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్ ఇప్పుడు మార్కెట్ విలువ ప్రకారం రూ. 100 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా. ఇటీవలే ఇక్కడ రూ. 190 కోట్లకు పెంట్‌హౌస్, రూ. 95 కోట్లకు మరో అపార్ట్‌మెంట్, రూ. 114 కోట్లకు రీసేల్ యూనిట్‌లు అమ్ముడయ్యాయి

ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన గోయల్, జీన్ ఇంజినీరింగ్ చదివి, టెక్ రంగంలో ప్రవేశించి, తర్వాత జోమాటోని స్థాపించి, పెద్ద విజేతగా ఎదిగారు. ఇప్పుడు, ఇలా ఒక లగ్జరీ ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా ఆయన తన విజయాన్ని వ్యక్తీకరిస్తున్నారు. ఇంతవరకూ చాలామంది స్టార్టప్ ఫౌండర్లను చూశాం వారు ఎక్కువగా వ్యాపారాల్లోనూ, కొత్త పెట్టుబడుల్లోనూ దృష్టి పెడతారు. కానీ గత కొద్ది కాలంగా, వ్యక్తిగత స్థాయిలో స్థిరమైన భద్రత కోసం, వారు లగ్జరీ రియల్ ఎస్టేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది డీపిందర్ గోయల్ మాత్రమే కాదు నయం అనే సేల్ స్టార్టప్ కు చెందిన అశిష్ గూర్నానీ, మెక్ మై ట్రిప్ ఫౌండర్ దీప్ కాల్రా వంటి వారు కూడా ఇటువంటి హై-ఎండ్ ఇల్లు కొనుగోలు చేస్తున్నారు.

డీపిందర్ ఇంటి ఎంపిక వెనుక ఉన్న మరో ఆసక్తికర విషయం. ఇది కేవలం ఒక ఇంటి కొనుగోలు కాదు, ఒక "ప్రశాంతమైన స్పేస్" కోసం ప్రయత్నం. బిజీ లైఫ్, రోజూ మెంటల్ ప్రెజర్ మధ్య, ఇలా ప్రశాంతమైన గ్రీన్ ఎరియాతో కూడిన హోం ఉండటం అనేది ఒక మెంటల్ రిలీఫ్. మానసిక ప్రశాంతతకు విలువ పెరుగుతున్న ఈ కాలంలో, డీపిందర్ గోయల్ తానూ అదే వైపు అడుగులు వేసినట్లు తెలుస్తోంది.

ఇది భారతదేశంలో LEED ప్లాటినం (లీడర్ షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్) సర్టిఫికేషన్ పొందిన తొలి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. అంటే, ఇది పర్యావరణ హితమైన నిర్మాణ పద్ధతులను పాటిస్తుంది. ప్రతి అపార్ట్‌మెంట్‌కు 200 ఎకరాల DLF గోల్ఫ్ & కంట్రీ క్లబ్, అరావళి అడవుల వైపు అద్భుతమైన వ్యూ ఉంటుంది. నగర శబ్దం దూరంగా, ప్రకృతి మధ్యలో ప్రశాంత వాతావరణం అందిస్తుంది.

రేన్ వాటర్ హార్వెస్టింగ్, సోలార్ ప్యానెల్స్, వాయు పరిశుద్ధి వ్యవస్థలు వంటి పర్యావరణహిత సదుపాయాలతో ఇది ఒక ఆధునిక, స్మార్ట్ జీవనశైలి ప్రతీక. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ లొకేషన్ కూడా అంతే అద్భుతం. నగరానికి సమీపంగా ఉండటం వల్ల రోజు వారి అవసరాలకు చక్కటి అనుసంధానం కలిగింది. ప్రధాన రహదారులకు, అంతర్జాతీయ విమానాశ్రయానికి, ఐటీ హబ్‌కు ఎంతో దగ్గరగా ఉండటంతో, ప్రయాణాలు సులభం కాగా, ఉద్యోగం మరియు జీవనశైలికి అదనపు సౌకర్యం లభిస్తుంది. డీఎల్‌ఎఫ్ ది కామెలియాస్ ఇప్పుడు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ధనికులు, ప్రముఖుల నివాస స్థలంగా మారింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+