గుడ్డులో ఉండే పోషకాలు అంత ఇంత కాదు. రోజుకో గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుడ్డు తినడం వాళ్ళ కలిగే లాభాలు కూడా ఎన్నో. అయితే ఈ గుడ్ల ధర మన దేశంలో ఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం భారీగా పెరిగింది. కానీ ప్రపంచవ్యాప్తంగా గుడ్ల ధర ఎలా ఉన్నాయో తెలుసా... అమెరికాలో తాజాగా గుడ్ల ధర భారీగా పెరిగింది. ఒక విధంగా చూస్తే 2021 నుండి 2024 మధ్య గుడ్ల ధర 238% పెరిగింది. అయినాసరే గుడ్ల ధర అత్యధికంగా ఉన్న టాప్ 10 దేశాల లిస్టులో అమెరికా లేదు. నంబియో ప్రకారం, స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అత్యధిక గుడ్ల ధర ఉన్న ప్రదేశం. ఈ దేశంలో ఒక డజను గుడ్ల కోసం మీరు 6.71 డాలర్లు అంటే దాదాపు 583 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఒక గుడ్డు కోసం దాదాపు 50 రూపాయలు ఖర్చు చేయాలి. మరోవైపు, ప్రపంచంలోనే గుడ్ల ధర అతితక్కువగా ఇండియాలో ఉంది. భారతదేశంలో మీరు ఒక డజను గుడ్లను $0.96కు పొందుతారు, అంటే దాదాపు రూ.84. అంటే ఒక గుడ్డు ధర ఏడు రూపాయలు.
స్విట్జర్లాండ్ తర్వాత అత్యధిక గుడ్ల ధర ఉన్న దేశం న్యూజిలాండ్. ఈ దేశంలో ఒక డజను గుడ్లు కొనాలంటే మీరు $6.20 ఖర్చు చేయాలి. ఒక డజను గుడ్ల ధర డెన్మార్క్‌లో $4.56, నెదర్లాండ్స్‌లో $4.40, ఆస్ట్రియాలో $4.16, ఆస్ట్రేలియాలో $4.12, గ్రీస్‌లో $4.06, ఇజ్రాయెల్‌లో $4.05, నార్వేలో $3.97 ఇంకా ఫ్రాన్స్‌లో $3.94. దీని తరువాత అమెరికా వస్తుంది. ఈ దేశంలో ఒక డజను గుడ్ల ధర 3.94 డాలర్లు అంటే దాదాపు 342 రూపాయలు. అంటే ఒక గుడ్డు ధర దాదాపు రూ.29. జర్మనీలో ఒక డజను గుడ్ల ధర $3.38 అయితే, జపాన్‌లో మీరు గుడ్ల కోసం $2.09 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అతితక్కువ ధర ఎక్కడ ?
భారతదేశం తరువాత మీకు ఇరాన్‌లో గుడ్లు తక్కువ ధరకు లభిస్తాయి. ఇక్కడ ఒక డజను గుడ్లు కొనాలంటే, మీరు $1.15 (రూ.99.92) చెల్లించాలి. ఆ తర్వాత పాకిస్తాన్ $1.20 (రూ.104.26), బంగ్లాదేశ్ $1.22(రూ.106.00), రష్యా $1.44 (రూ.125.11), ఈజిప్ట్ $1.45 (రూ.125.98), ఇండోనేషియా $1.59(రూ.125.98) ఇంకా చైనా $1.62 (రూ.140.75) ఉన్నాయి. అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అలాగే చైనాలలో గుడ్ల ధర భారతదేశం కంటే ఎక్కువగా ఉన్నాయి. టర్కిలో ఒక డజను గుడ్ల ధర $1.65 (రూ.143.35), కజకిస్తాన్‌లో $1.67(రూ.145.03), బ్రెజిల్‌లో $1.97(రూ.171.09), ఫిలిప్పీన్స్‌లో $2.02(రూ.191.08).


Click it and Unblock the Notifications