పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలుసు.. కానీ, ఇప్పుడు అది జేబుకు కూడా చాలా హానికరం కాబోతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న సరికొత్త చట్టం వల్ల దేశంలో సిగరెట్ ధర (cigarette cost) సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకోనుంది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.18 రూపాయలకు లభిస్తున్న ఒక్క సిగరెట్ ధర త్వరలోనే రూ.72 రూపాయలకు చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రవేశపెట్టిన 'సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు, 2025' కు పార్లమెంట్ ఆమోదం తెలపడమే దీనికి కారణం.

ధరలు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయి?
పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను (Excise Duty) భారీగా పెంచింది.
- పాత సుంకం: ఇప్పటివరకు 1,000 సిగరెట్ స్టిక్స్‌పై రూ.200 నుండి రూ.735 వరకు డ్యూటీ ఉండేది.
- కొత్త సుంకం: కొత్త బిల్లు ప్రకారం.. ఇది ఏకంగా రూ.2,700 నుండి రూ.11,000 వరకు పెరగనుంది.
అంటే సుమారు 10 నుండి 15 రెట్లు పన్ను పెరగడంతో.. రిటైల్ మార్కెట్‌లో సిగరెట్ ధరలు చుక్కలను తాకనున్నాయి.
హీటెక్కిన సోషల్ మీడియా.. నెటిజన్ల ఫన్నీ రియాక్షన్స్!
ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్స్ వెల్లువెత్తాయి. కొందరు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. మరికొందరు వెరైటీగా స్పందిస్తున్నారు.
- "ఢిల్లీ వాసుల ధీమా": ఒక యూజర్ స్పందిస్తూ.. "మాకు ఏంటి భయం? మేము ఎలాగో ఢిల్లీ గాలి పీలుస్తూ బతికేస్తున్నాం.. అక్కడ సిగరెట్ తాగినా తాగకపోయినా ఒకటే.. మాకు గాలి ఫ్రీ!" అంటూ చమత్కరించారు.
- "మంచి నిర్ణయం": ఒక సిగరెట్ ప్రియుడు రెడ్డిట్ (Reddit) లో స్పందిస్తూ.. "నేను కూడా స్మోకర్‌నే.. కానీ, ఈ నిర్ణయం వల్ల కనీసం ఇప్పుడైనా నేను పొగ తాగడం మానేస్తానని నమ్ముతున్నాను. ముఖ్యంగా స్టూడెంట్స్ దీనికి దూరంగా ఉంటారు" అని రాసుకొచ్చాడు.
- "వేప్స్ కాలం": ధరలు పెరిగితే అందరూ ఇక ఈ-సిగరెట్లు లేదా వేప్స్ (Vapes) వైపు మొగ్గు చూపుతారని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేవలం సిగరెట్లు మాత్రమేనా?
అయితే కేవలం సిగరెట్ల ధరలు మాత్రమే కాదు, ఈ బిల్లు వల్ల అన్ని రకాల పొగాకు ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. హుక్కా టొబాకోపై పన్ను 25% నుండి 40% కి పెరిగింది. అలాగే చ్యూయింగ్ టొబాకో (ఖైనీ, జర్దా)పై పన్ను 25% నుండి ఏకంగా 100% కి పెంచారు. ఇక పైపుల్లో వాడే స్మోకింగ్ మిశ్రమాలకు పన్ను 60% నుండి 325% కి పెరిగింది.
ప్రమాదం కూడా ఉందా?
ధరలు విపరీతంగా పెరగడం వల్ల నకిలీ సిగరెట్లు (Illegal/Fake Cigarettes) మార్కెట్‌లోకి వచ్చే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. నియంత్రణ లేని ఇలాంటి నకిలీ ఉత్పత్తుల వల్ల ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా.. పెరగబోతున్న సిగరెట్ ధరలు (cigarette cost) చూస్తుంటే చాలా మంది స్మోకింగ్ ప్రియులకు ఇది చేదు వార్తగానే కనిపిస్తోంది. మరి ఈ ధరల పెరుగుదల వల్ల నిజంగా స్మోకింగ్ తగ్గుతుందా? లేదా? అనేది చూడాలి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications