Business Ideas: భారతదేశంలో చాలా మంది వ్యవసాయ కుటుంబ నేపథ్యంలో నుంచి వచ్చినవారే. అధిక ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు చేస్తున్న చాలా మంది ఇప్పుడు వ్యవసాయం వైపు మెుగ్గుచూపుతున్నారు. తమ పూర్వీకుల మార్గంలోనే ముందుకు సాగుతున్నారు.
తక్కువ పెట్టుబడితో రసాయనాలు వినియోగించకుండా పండించే కూరగాయలు, ఆకుకూరలు వంటి ఆర్గానిక్ ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. మారుతున్న ప్రజల జీవనశైలితో పాటు మంచి ఆహార అలవాట్ల వైపు మళ్లుతున్నారు. అయితే ఇప్పుడు ఇది యువ రైతులకు మంచి ఆదాయ మార్గంగా మారుతోంది.

ప్రాచీన సేంద్రిన పద్ధతుల్లో నెలకు రూ.20 వేలు పెట్టుబడితో కూరగాయల సాగును ప్రారంభిస్తే నెలకు రూ.50 వేలు నుంచి రూ.70 వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. సహజసిద్ధమైన ఎరువుల వినియోగం రైతులకు ఖర్చులను తగ్గించటంతో పాటు దిగుబడిని కూడా పెంచుతుంది. పైగా ఇలా పండించే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ కూడా ఉంది.
ఇలా పంటలను పండించే రైతులు సమీపంలోని మార్కెట్లలో స్టాల్ ఏర్పాటు చేసుకుని విక్రయించవచ్చు. లేదంటే ఆన్ లైన్ యాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుని వినియోగదారులకు డెలివరీ చేయవచ్చు. ఇదే సమీపంలోని సూపర్ మార్కెట్లు, మాల్స్ వంటి చోట్ల ఉండే స్టోర్లతో అగ్రిమెంట్ కుదుర్చుకుని ఉత్పత్తులను సరఫరా చేయవచ్చు. ఇలా చేయటం వల్ల ఎక్కువ మంది కస్టమర్లకు ఉత్పత్తులను విక్రయిస్తూ తక్కువ సమయంలో మంచి లాభాలను పొందవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications