Investment: ఆర్థిక అస్థిరతలు, విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా డబ్బు ఆదా చేయడం, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం కష్టంగా మారింది. ఇలాంటి సందర్భంలో కొంత క్రమశిక్షణతో పాటు ఆధునిక పొదుపు పద్ధతులను వినియోగించుకోవటం మనల్ని లక్ష్యాలవైపు నడిపించగలదు.
ముఖ్యంగా ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు అని గుర్తుంచుకోవాలి. ముందుగా ఆదాయం, ఖర్చులపై ఓ కన్నేసి ఉంచాలి. ముందుగా ఇందుకోసం నెలవారీ బడ్జెట్ వేసుకోవటం మంచి మార్గం. ఇలా చేయటం వల్ల అనవసరమైన ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఈ క్రమంలో ప్రతినెల శాలరీ అకౌంట్ నుంచి సేవింగ్స్ ఖాతాకు కొంత మెుత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఆటో పే సెటప్ చేయటం పాటించదగిన పద్ధతి. దీనిని ఒకసారి ప్రారంభించిన తర్వాత కొనసాగించటం వల్ల తెలియకుండానే ఖర్చులు కూడా అదుపులోకి వస్తాయి.

డబ్బును ఆదా చేసేందుకు ముందుగా అధిక వడ్డీతో కూడిన క్రెడిట్ కార్డు బిల్లులను క్లియర్ చేసుకోవాలి. ఇది అధిక వడ్డీల భారాన్ని తగ్గిస్తుంది. అందువల్ల జీవితంలో ముందుగా ఇలాంటి రుణాలను తిరిగి చెల్లించటానికి ప్రాధాన్యత ఇవ్వటం ముఖ్యం. ఇలా చేయటం వల్ల అవి మీ పొదుపు జర్నీలో అడ్డంకులుగా మారకుండా ఉంటాయి. అలాగే పొదుపు నిర్ణయం తీసుకునేటప్పుడు భవిష్యత్తు అవసరాలు,లక్ష్యాలు, ఖర్చులకు అనుగుణంగా ఒక మెుత్తాన్ని ఎంచుకోవటం మంచిది. నామమాత్రంగా డబ్బు ఆదాచేయాలని చిన్న మెుత్తంతో ముందుకు వెళితే అది నిరుపయోగమని గుర్తుంచుకోండి.
దీనితో పాటు ఎమర్జెన్సీ ఫండ్ కింద మీరు కనీసం 3-6 నెలల ఖర్చులకు సరిపోయే డబ్బును ముందుగా సేవ్ చేసుకోవాలి. అనుకోని పరిణామాల వల్ల ఉద్యోగాన్ని కోల్పోయినట్లయితే ఇది తర్వాతి ఉద్యోగం తొరికేంతవరకు అవసరాలకు ఫండ్ చేయటంలో సహాయపడుతుంది. అలాగే వృద్ధాప్యంలో ఎదురయ్యే ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించటం మంచిది. ఇందుకోసం మీరు సైడ్ జాబ్ లేదా ఫ్రీలాన్సింగ్ వంటి ఏర్పాట్లు చేసుకోవటం మంచిది.


Click it and Unblock the Notifications