Business Ideas: ప్రస్తుతం దేశంలో పంటలు పండిస్తున్న వారు చాలా ముఖ్యంగా మారిపోయారు. రేట్లు అమాంతం పెరిగిపోవటంతో చాలా మందికి వ్యవసాయం ఎంత ముఖ్యమైనదో గమనిస్తున్నారు. సొంతంగా ధనవంతులు కావాలనుకునేవారికి ఈ పంట మంచి నిర్ణయం.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది లాభదాయకమైన యాలకుల పంట గురించే. మసాలా దినుసుల్లో ప్రముఖమైన దీనిని పెద్ద ఎత్తున్న దేశంలో పండిస్తున్నారు. ఇది వాణిజ్య పంట కావటంతో సాగు చేసేవారికి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. వీటి సాగుకు లోమీ నేలలు ఉత్తమమైనవి. అలాగే లేటరైట్, నల్ల రేగడి నేలల్లో కూడా పంట వేయవచ్చు. 10-35 డిగ్రీల ఉష్ణోగ్రత సాగుకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతోంది.

పొలంలో ప్రతి మెుక్కకు 2-3 అడుగుల దూరం ఉండేలా నాటుకోవాలి. అలాగే వీటికి పేడను ఎరువుగా వినియోగిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. నాటిన తర్వాత మెుక్కలు దిగుబడిని ఇచ్చేందుకు సిద్ధం కావటానికి 3-4 ఏళ్లు పడుతుంది. దిగుబడి సమయంలో యాలకులను చెట్ల నుంచి కోసిన తర్వాత కొద్ది రోజుల పాటు ఎండలో తేమ ఆరిపోయేంత వరకు ఆరబెట్టాలి. అలాగే జూలై వర్షాకాలంలో మెుక్కలను పొలాల్లో నాటాలి. ఈ మెుక్కలకు అధిక సూర్యరశ్మి లేకుండా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే దిగుబటి తగ్గే ప్రమాదం అధికంగా ఉంటుంది.
యాలకులు ఎండినప్పుడు వాటిని పరిశీలించి నాణ్యతను బట్టి వివిధ గ్రేడ్ల కింద మార్కెటింగ్ చేస్తుంటారు. దీనిలో వాటి రంగు, సువాసన, పరిమాణం వంటి వాటిని పరిగణలోకి తీసుకుని ధరను నిర్ణయిస్తారు. హెక్టారుకు 135 నుంచి 150 కిలోల వరకు యాలకులు దిగుబడి పొందవచ్చు. మార్కెట్‌లో కిలో ధర రూ.1100 నుంచి రూ.2000 వరకు ఉంది. దీని ప్రకారం రైతుకు యాలకుల సాగుద్వారా హెక్టారుకు రూ.6 లక్షల వరకు ఆదాయం పొందవచ్చని తెలుస్తోంది. ఈ సాగులో మెళకువలను నేర్చుకోవటం ద్వారా తక్కువ నష్టాలతో రైతులు ఎక్కువ లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications