Business Ideas: లక్షల్లో జీతాలు సంపాదించే ఉద్యోగులు సైతం ఒత్తిళ్లకు తట్టుకోలేక సొంతంగా వ్యాపారం చేసుకోవటం మేలని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇటీవలి కాలంలో చాలా మంది సొంతంగా తమ వ్యాపారాలను ప్రారంభించాలని చూస్తున్నారు.
అయితే మనం ఉన్న ప్రాంతంలోనే ప్రారంభించి భవిష్యత్తులోనూ డిమాండ్ ఉండే బిజినెస్ కావాలని చాలా మంది ఆశిస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నద్ది ఎలక్ట్రిక్ వాహనల ఛార్జింగ్ స్టేషన్ వ్యాపారం గురించే. అవును కేంద్ర ప్రభుత్వం రానున్న కొన్ని సంవత్సరాల్లో ఇంధనంతో నడిచే వాహనాలను పూర్తిగా నిలిపివేయాలని చూస్తోంది. దీంతో ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు, ట్రక్కులపై దృష్టి పెరిగింది. ప్రజలు సైతం దీనికి అనుగుణంగా ఈవీలను కొనుగోలు చేస్తున్నారు.

దేశంలో ఈవీలు పెరుగుతున్నంత వేగంగా వాటికి అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు జరగటం లేదు. ఈ కొరతను మంచి వ్యాపార అవకాశంగా మార్చుకునేందుకు ముందుగా ప్రయత్నించేవారు ఎక్కువ సంపాదించుకోవచ్చు. ప్రభుత్వ నియమాల ప్రకారం రహదారులకు ఇరువైపులా ప్రతి 25 కిలోమీటర్లకు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్లను అమర్చవచ్చు. అలాగే కనీసం 3 కిలోమీటర్ల దూరంలో ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయవచ్చు. బస్సులు, ట్రక్కులు వంటి హెవీ ఎలక్ట్రిక్ వాహనాల కోసం కనీసం 100 కిలోమీటర్ల దూరంలో ఛార్జింగ్ పాయింట్లను స్థాపించవచ్చు.

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కెపాసిటీలను బట్టి ఖర్చు మారుతుంటుంది. బేసిక్ స్టేషన్ ఏర్పాటుకు కనీసం రూ.లక్ష పెట్టుబడిగా అవసరం ఉంటుంది. దీనికోసం 50-80 చదరపు గజాల స్థలం అవసరం ఉంటుంది. వీటిని ఏర్పాటు చేసేందుకు స్థానిక విద్యుత్ అధికారుల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఒక్కసారి పెట్టుబడి పెట్టిన తర్వాత ఎలాంటి అదనపు ఖర్చులు ఉండవు. ప్రస్తుతం ప్రభుత్వం ఇలాంటి వాటిని ఏర్పాటును ప్రోత్సహిస్తూ వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నాయి. అందువల్ల సరైన కమర్షియల్ ఏరియాలో వాహనదారుల అవసరాలకు అనుగుణంగా ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో పెరిగే డిమాండ్ కారణంగా మంచి ఆదాయాన్ని పొందవచ్చు.


Click it and Unblock the Notifications