ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో మరియు స్విగ్గీలు ఎంతగానో పాపులారిటీ సాధించాయి. వీటికి పోటీగా మార్కెట్‌లోకి మరికొన్ని కంపెనీలు వచ్చినా అంతగా సక్సెస్ సాధించలేకపోయాయి. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC)ద్వారా మరికొన్ని ఔత్సాహిక సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెట్టాయి. ప్రస్తుతం ONDCలో నమోదైన సంస్థలను వినియోగదారులు ఇతర వాటితో పోలుస్తుండటం సోషల్ మీడియాలో ట్రెడింగ్ గా మారింది.
ఆటోమేషన్ ప్లాట్‌ఫారమ్ అరిటిక్ వ్యవస్థాపకులు అంకిత్ ప్రకాష్ చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట చర్చకు దారి తీసింది. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC)లో విక్రయదారు అయిన ఇండియానా బర్గర్స్ నుంచి Paytm ద్వారా పనీర్ బర్గర్-అండ్-పెప్సీ కాంబోను ఆయన ఆర్డర్ చేశారు. అయితే అదే ఐటమ్ ధర స్విగ్గీతో పోలిస్తే దాదాపు 45 శాతం తక్కువ ఉన్నట్లు గమనించారు.

ప్రకాష్ తరహాలోనే ఇతర వినియోగదారులు సైతం ప్రస్తుతం ఆయా ప్లాట్ ఫారమ్‌లలో ధరలను పోల్చడం ప్రారంభించారు. తద్వారా ONDC రోజువారీ ఆర్డర్ వాల్యూమ్‌లు 2.5 రెట్లు పెరిగాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే 10 వేల నుంచి 25 వేలకు ఎగబాకినట్లు తెలుస్తోంది. దేశంలోని 5 బిలియన్ డాలర్ల ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో 90 శాతం వాటా స్విగ్గీ మరియు జొమాటో నియంత్రణలోనే ఉంది. కాగా ప్రస్తుతం మొదలైన ఈ ట్రెండ్ వల్ల ఆయా సంస్థల వ్యాపారాన్ని ONDC నాశనం చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ONDC ప్లాట్ ఫారమ్ ద్వారా ఆహారం, పానీయాలు మరియు కిరాణా సరుకుల ఆర్డర్‌లు గత కొన్ని నెలల్లో 100 రెట్లు పెరిగాయి. ఇందులో కొత్త వినియోగదారులకు ఆర్డర్లపై రూ. 50 తగ్గింపు కూపన్ సైతం లభిస్తోంది. స్విగ్గీ, జొమాటోలో ఆయా ఉత్పత్తుల ధరలు ఎక్కువగా ఉన్నా కొన్నిసార్లు డిస్కౌంట్లు, కూపన్ల ద్వారా దాదాపు 20-40 శాతం తక్కువ ధరకే లభిస్తున్నట్లు తెలుస్తోంది. ONDC లాయల్టీ ప్రోగ్రామ్ సభ్యత్వం పొందినట్లయితే డెలివరీ ఛార్జీల నుంచి కూడా మినహాయింపు పొందవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications