ఇక్కడ హాట్ కేకుల్లా అమ్మడువుతున్న టమోటాలు.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్స్ కంటే ఫాస్ట్ గురూ..!
ONDC: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ దేశంలోని ప్రముఖ దిగ్గజ ఆన్ లైన్ ఇ-కామర్స్ సంస్థలు. అంతర్జాలంలో ఆర్డర్ చేసే ట్రెండ్ పెరుగుతుండటంతో పలు కంపెనీలు వీటికి ప్రత్యర్థుల్లాగా పుట్టుకొస్తున్నాయి. వాటిలో కొన్నింటి ద్వారా ప్రజలు మోసాల బారిన పడుతున్నారు. వీటిని సరిదిద్దుతూ, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో ప్రభుత్వ మద్ధతుతో ONDC రూపుదిద్దుకుంది.
దేశవ్యాప్తంగా టమోటా రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. ఈ పరిస్థితుల్లో ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ద్వారా రాయితీపై టమోటాలు విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేశరాజధాని ఢిల్లీలో కేవలం రూ.70 కే కిలో చొప్పున అందించేందుకు ముందుకొచ్చింది. దీనికి ప్రజల వచ్చిన రెస్పాన్స్ చూసి ONDCనే షాక్ అయింది.

ఢిల్లీలో కేవలం 6 రోజుల్లోనే 10 వేల కిలోల రాయితీ టమోటాలు ONDC ద్వారా అమ్ముడయినట్లు Paytm నివేదించింది. ఆ మొత్తంలో తమ యాప్ ద్వారా 60 శాతం విక్రయాలు జరిగినట్లు తెలిపింది. మరో వారంపాటు ఇదే పద్ధతిలో విక్రయించడానికి ONDC సిద్ధమవుతోంది. Paytm, మ్యాజిక్ పిన్, మై స్టోర్, పిన్ కోడ్ వంటి యాప్స్ ద్వారా ఈ రాయితీ టమోటాలను కొనుగోలు చేయవచ్చు.

ONDCలో టమోటాల విక్రయానికి మద్ధతుగా నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ (NCCF) రోజూ 2 వేల కిలోల టమోటాలను అందజేస్తుంది. అయితే అవన్నీ మధ్యాహ్నం లోపు అమ్ముడైపోతున్నట్లు ONDC చీఫ్ కోశి తెలిపారు. ఫ్రీ డెలివరీతో పాటు ఒక్క ఆర్డర్ పరిమితితో మరో వారంపాటు టమోటాల విక్రయాలు జరుపుతామని వెల్లడించారు.


Click it and Unblock the Notifications