ఉక్కు వ్యాపారం గురించి మాట్లాడేటప్పుడు ముందుగా గుర్తుకు వచ్చే పేరు లక్ష్మీ నివాస్ మిట్టల్. ఒకప్పుడు స్టీల్ మిల్లులో శిక్షణ పొంది, సాధారణ కార్మికుడిగా జీవితం ప్రారంభించిన వ్యక్తి, నేడు లక్షల కోట్లకు పైగా విలువైన ఆస్తులతో ప్రపంచ ఉక్కు రారాజుగా వెలుగొందుతున్నారు. ఆయనే లక్ష్మీ నివాస్ మిట్టల్. జూన్ 15న 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ భారతీయ బిలియనీర్ ప్రస్థానం ఎందరికో ఆదర్శప్రాయం.

అయితే 1950లో రాజస్థాన్‌లోని సాదుల్‌పూర్‌లో జన్మించిన లక్ష్మీ మిట్టల్, 1960లలో తన కుటుంబంతో కలిసి కోల్‌కతాకు వలస వెళ్లారు. అక్కడ అతని తండ్రి స్టీల్ మిల్లు నడిపేవారు. సెయింట్ జేవియర్స్ కళాశాలలో సైన్స్ చదువుతూనే, మిట్టల్ తన తండ్రి మిల్లులో పనిచేశారు. గ్రాడ్యుయేషన్ తర్వాత అదే మిల్లులో ట్రైనీగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.
ప్రపంచవ్యాప్త విస్తరణ: 1976లో ఇండోనేషియాకు వెళ్లిన మిట్టల్, అక్కడ ఒక చిన్న ఉక్కు కంపెనీని స్థాపించారు. అదే నేడు ఆర్సెలర్ మిట్టల్గా అవతరించి, ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారిగా నిలిచింది. ఇస్పాట్ ఇంటర్నేషనల్, LNM హోల్డింగ్స్ విలీనం, ఇంటర్నేషనల్ స్టీల్ గ్రూప్‌ను కొనుగోలు చేయడంతో 2004లో మిట్టల్ స్టీల్ రూపుదిద్దుకుంది. ఆ తరువాత 2006లో మిట్టల్ స్టీల్ ఆర్సెలర్‌తో విలీనమై ఆర్సెలర్ మిట్టల్గా మారింది.
అవార్డులు, గౌరవాలు: మిట్టల్ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి చేసిన కృషికి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 1996లో 'స్టీల్‌మేకర్ ఆఫ్ ది ఇయర్', 1998లో 'విల్లీ కోర్ఫ్ స్టీల్ విజన్ అవార్డు' వంటి అంతర్జాతీయ గుర్తింపులు పొందారు. 2004లో ఫార్చ్యూన్ మ్యాగజైన్ ఆయనను 'యూరోపియన్ బిజినెస్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్'గా, సండే టైమ్స్ 'బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా, టైమ్ మ్యాగజైన్ 'ఇంటర్నేషనల్ న్యూస్ మేకర్ ఆఫ్ ది ఇయర్'గా ప్రకటించాయి. 2006లో ఫైనాన్షియల్ టైమ్స్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' గా గుర్తించింది. జనవరి 2007లో మిట్టల్‌కు కాలేజ్ అత్యున్నత పురస్కారమైన కింగ్స్ కాలేజ్ లండన్ నుండి ఫెలోషిప్ లభించింది.
2008 జనవరిలో, భారత రాష్ట్రపతి మిట్టల్‌కు భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ను ప్రదానం చేశారు. నేడు లక్ష్మీ మిట్టల్ ప్రఖ్యాత ప్రపంచ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ఆర్సెలర్ మిట్టల్‌లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా (ఫిబ్రవరి 2021 నుండి) కొనసాగుతూ అపెరామ్ బోర్డు ఛైర్మన్‌గా, గోల్డ్‌మన్ సాచ్స్ బోర్డు సభ్యుడిగా కూడా సేవలందిస్తున్నారు. విద్య, పిల్లల ఆరోగ్యం రంగాలలో ఆయన ఒక చురుకైన పరోపకారి. అయితే లక్ష్మీ మిట్టల్ జీవిత చరిత్ర, ప్రస్థానం అన్ని కూడా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications