Diwali 2026: ఉద్యోగులకు నోట్ల కట్టలు.. ఒక్కొక్కరికి రూ.88 వేలు..
దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటారు. ముఖ్యంగా ఉత్తరాదిన దీపావళికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండగ సందర్భంగా కంపెనీలు ఉద్యోగలకు స్వీట్లు, గిఫ్టులు ఇస్తుంటాయి. అయితే ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ ఉద్యోగులకు ఐఫోన్ గిఫ్డ్ గా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్లో ఓ వ్యాపారవేత్త దీపావళి సందర్భంగా తన ఉద్యోగులకు నగదు బహుమతి ఇచ్చారు. పండుగను ఉద్యోగులు కూడా ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఏకంగా ఒక్కొక్కరికి రూ.88 వేల చొప్పున నగదును బోనస్‌గా ఇచ్చారు.
బోనస్ ఇవ్వడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వస్త్ర వ్యాపారవేత్త రామ్‌స్వరూప్ ముండ్ ధంతేరస్ సందర్భంగా ఉద్యోగుల కోసం ఓ కార్యక్రమం నిర్వహించారు. తన వద్ద పనిచేస్తున్న దాదాపు 21 మంది ఉద్యోగులకు భారీ మొత్తంలో బోనస్ ను స్వయంగా ఇచ్చారు. ఓ టేబుల్ మీద నోట్ల కట్టలు పెట్టుకుని ఉద్యోగులను ఓ వరుసలో నిలబెట్టి ఒకరి తర్వాత ఒకరికి బోనస్ డబ్బులు అందించారు. రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్ల కట్టలను ఉద్యోగులకు పంచారు. ఒక్కొక్క ఉద్యోగికి రూ.88 వేల ఇచ్చారు. ఇందుకు దాదాపు రూ.18.48 లక్షలు అయినట్లు తెలుస్తోంది.

రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాకు చెందిన రామ్‌స్వరూప్ ముండ్ గుజరాత్ లో ని సూరత్ లో వ్యాపారం చేస్తున్నారు. దీపావళిని సంతోషంగా, సుసంపన్నంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే బోనస్ నగదును అందించారు. కాగా బోనస్ డబ్బులు అందుకున్న ఉద్యోగులు భావోద్వేగానికి గురయ్యారు. కొంత మంది యజమాని కాళ్లపై పడ్డారు. నగదు ఇప్పుడే కాదు.. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ప్రతి ధంతేరస్ సందర్భంగా తన ఉద్యోగులకు ఇలా నగదు బహుమతులు అందిస్తున్నారు రామ్ స్వరూప్ ముండ్. వ్యాపారంలో తనకు తోడుగా నిలిచే ఉద్యోగుల సంతోషాన్ని కూడా తన బాధ్యతగా భావిస్తూ ఆయన చేసిన పనికి అందరు ప్రశంసిస్తున్నారు. గతం కొంత మంది యజమానులు ఉద్యోగులు కార్లు కూడా గిఫ్డ్ గా ఇచ్చిన ఘటనలు కూడా చూశాం.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications