PM Kisan: శుక్రవారం రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు.. విడుదల చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ..!
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడత నిధులు శుక్రవారం విడుదల కానున్నాయి. అక్టోబర్ 30, 2026 నాడు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లోని బానస్కాంతలో పీఎం కిసాన్ 24వ విడత నిధులు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ద్వారా నిధులు రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. కాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా నాలుగు నెలలకు రూ.2 వేలు చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 23 విడతలుగా రూ.46 వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
శుక్రవారం నాడు 24వ విడత విడుదల చేయనున్నారు. 23వ నిధులు గత జూన్ రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడత నిధులు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ కావాలంటే.. రైతులు తప్పనిసరిగా ఇకేవైసీ చేసుకోవాలి. ఈ కేవైసీ చేసుకున్న రైతులకు నిధులు అందనున్నాయి. ఇక ఈ పథకం కింద ఇచ్చే రూ.6 వేలను రూ.12 వేలకు పెంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పథకాన్ని 2019 తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇవే రూ.6 వేలు ఇస్తున్నారని రైతు సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుతం కూలీలు, ఎరువులు, విత్తనాలు ధరలు పెరిగాయని.. అందుకు తగ్గట్లుగా పీఎం కిసాన్ ద్వారా ఇచ్చే రూ.6 వేలను రూ.12 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

పీఎం కిసాన్ పథకానికి సంబంధించి గత బడ్జెట్ కు ముందు చర్చ జరిగింది. బడ్జెట్ పీఎం కిసాన్ నిధులు రూ.6 వేల నుంచి రూ.9 వేలకు పెంచుతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వచ్చే బడ్జెట్లో పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలను రూ.9 వేలకు పెంచే అవకాశం వార్తలు వస్తున్నాయి. అయితే రైతుల కోసం కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా పలు పథకాలు తీసుకొచ్చింది. ఏపీలో అన్నదాత సుఖీభవ కింద రైతులకు సంవత్సరానికి రూ.20 సాయం చేస్తున్నారు. ఇందులో పీఎం కిసాన్ రూ.6 వేలు పోగా.. మిగతా డబ్బు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెల్లిస్తున్నారు.
ఇక తెలంగాణలో రైతు భరోసా పేరుతో రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. సీజన్ లో ఎకరాకు రూ.6 వేల చొప్పున సంవత్సరానికి రూ.12 వేలు రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. అంటే సంవత్సరానికి ఎకరాకు రూ.12 వేలు చెల్లిస్తోంది. గత వర్షాకాల సీజన్ కు సంబంధించి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. అయితే యాసంగి సీజన్ కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ లేదు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications