కరోనా నేపథ్యంలో మార్చి నుండి ఆగస్ట్ వరకు ఇచ్చిన లోన్ మారటోరియం కేసులో వడ్డీ వసూలు నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం మరో రెండు రోజులలో తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీం కోర్టుకు నిన్న విన్నవించారు. వడ్డీ వసూలు చేయాలా వద్దా అనే అంశానికి సంబంధించి రెండు మూడు రోజుల్లో నిర్ణయం ఉంటుందని తెలిపింది.
ఈ అంశానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, వడ్డీ చెల్లింపు నిర్ణయం ఖరారు చివరి దశకు వచ్చిందని వెల్లడించింది. ప్రభుత్వం నిర్ణయాన్ని రికార్డ్ చేసి, వడ్డీ చెల్లింపు అంశంపై పిటిషన్లు దాఖలు చేసిన వాళ్లకు అఫిడవిట్లు పంపించాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది.

అక్టోబర్ 1 నాటికి అఫిడవిట్
వివిధ పరిశ్రమలు, వాణిజ్య సంఘాలు, వ్యక్తులు వేసిన పిటిషన్లను అక్టోబర్ 5వ తేదీన విచారిస్తామని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. వడ్డీ చెల్లింపు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, దీనిపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ వివరాలతో పాటు అఫిడవిడ్ సమర్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్ 1వ తేదీ వరకు ఈ-మెయిల్ ద్వారా అఫిడవిట్ సమర్పిస్తామని తెలిపింది. అనంతరం సుప్రీం కోర్టు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మళ్లీ వాయిదాను కోరుకోవడం లేదని సుప్రీం కోర్టు బెంచ్ తెలిపింది. ప్రభుత్వం విధానం ఏదయినా వివరాలు పంపించాలని తెలిపింది.
లోన్ మారటోరియం కాలానికి వడ్డీ అంశం చాలా కీలకమైన అంశమని, దీనిని బ్యాంకులు సాధారణ అంశంగా పరిగణిస్తున్నాయని పిటిషనర్ గజేంద్ర సింగ్ తరఫు లాయర్ సుప్రీం కోర్టుకు తెలిపారు. అయితే ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో నిర్ణయాన్ని వెలువరుస్తుందని సొలిసిటర్ జనరల్ తెలిపారు. కాగా, మారటోరియం కాలానికి వడ్డీ తదితర అంశాలకు సంబంధించి అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఓ కమిటీని వేసింది.

వడ్డీ మాఫీపై...
లోన్ మారటోరియం కాలానికి వడ్డీ మాఫీ అంశానికి సంబంధించి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. బ్యాంకింగ్ వ్యవస్థ ప్రాథమిక ఉద్దేశ్యం డిపాజిటర్ల డబ్బును రక్షించడమని, డిపాజిటర్ల డబ్బునే బ్యాంకులు అప్పుగా ఇస్తాయని తెలిపారు. కాబట్టి వడ్డీ మాఫీ సరికాదని అభిప్రాయపడ్డారు. రుణ మారటోరియం కాలంలో వడ్డీ (వడ్డీపై వడ్డీ) మాఫీ సరికాదని బ్యాంకర్లు కూడా భావిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో భారం
ఇక్కడ మరో వాదన కూడా ఉంది. లోన్ మారటోరియం పొడిగిస్తే క్రెడిట్ సంస్కృతి దెబ్బతింటుందని, ఎన్పీఏలు పెరుగుతాయని భావించడం పక్కన పెడితే, కరోనా నేపథ్యంలో తీవ్రంగా దెబ్బతిన్న వారికి మారటోరియం రూపంలో ఊరట ఇస్తూనే, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వడ్డీపై వడ్డీ వేయడం భారమని అంటున్నారు. ఇటీవలి కాలంలో రుణ మారటోరియాన్ని ఉపయోగించుకునే వారి సంఖ్య కూడా తగ్గింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications