Multibagger Stock: మార్కెట్లో ఎక్కువ శాతం మల్టీబ్యాగర్లు పెన్నీ, మిడ్ క్యాప్ కంపెనీల్లోనే ఉంటుంటాయి. వీటిలో నష్టాలను చవిచూసే ఛాన్స్ తో పాటు ఊహించని లాభాలను పొందే అవకాశాలు కూడా దాగి ఉంటాయి. అయితే దీనికోసం ముందుగా వాటి వ్యాపారాల గురించి ఆర్థిక ఫండమెంటల్స్ గురించి మనం నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతున్న స్టాక్ సైతం భవిష్యత్తులో మంచి వృద్ధిని సాధించటానికి అవకాశాన్ని కలిగి ఉంది. మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నది స్మాల్ క్యాప్ కంపెనీ Olectra Greentech గురించే. ఈ కంపెనీపై బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అక్యూములేట్ రేటింగ్ అందించింది. రానున్న కాలంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ షేర్లు పెరుగుతాయని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది.

గడచిన 10 ఏళ్ల కాలంలో షేర్ 6800% రాబడిని అందించింది. ఏప్రిల్ 25, 2013న రూ.9.51గా ఉన్న స్టాక్ ధర ఈ రోజు మార్కెట్లో రూ.656 వద్ద ఉంది. అయితే బ్రోకరేజ్ తాజా అంచనా ప్రకారం రానున్న కాలంలో షేర్ ధర రూ.738కి చేరుకుంటుందని వెల్లడించింది. అంటే ప్రస్తుత మార్కెట్ ధర కంటే దాదాపు 10 శాతం కంటే ఎక్కువ రాబడిని షేర్ అందించనుందని తెలుస్తోంది.
కర్బన ఉద్గారాలను తగ్గించేపనిలో కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రస్తుతం చర్యలు చేపడుతున్నాయి. ఇవి కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ తో పాటు లాభదాయకతను పెంచటంలో దోహదపడతాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోని రీసెర్చ్ అనలిస్ట్ సజీ జాన్ తన నివేదికలో వెల్లడించారు. పైగా కంపెనీ ప్రస్తుతం బలమైన ఆర్డర్ బుక్ కలిగి ఉందని బ్రోకరేజ్ వెల్లడించింది.
ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు, మిశ్రమ పాలిమర్ ఇన్సులేటర్ల తయారీలో వ్యాపారాలను నిర్వహిస్తోంది. పైగా ఇది తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రాజెక్టులను చేపడుతున్న మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అనుబంధ సంస్థ కావటం గమనార్హం. గత ఏడాది కంపెనీ బృహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ నుంచి రూ.3,675 కోట్ల విలువైన 2,100 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్‌ను పొందింది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ లాభాలు 33 శాతం పెరిగి రూ.35.35 కోట్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications