Multibagger Stock: ఎలక్ట్రిక్ వాహనాల రంగం భవిష్యత్తు బంగారం అని మలో చాలా మందికితెలిసిందే. అయితే దీనిని ముందుగా అర్థం చేసుకున్న వారు ఇప్పుడు లాభపడుతున్నారు. మల్టీ బ్యాగర్ రాబడులను పొందుతున్నారు.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ఎలక్ట్రిక్ బస్ తయారీ సంస్థ Olectra Greentech గురించే. ఇతి తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ అనుబంధ కంపెనీ ఓలెక్ట్రా. ప్రస్తుతం ఈ స్టాక్ మార్కెట్లో జోరుమీద పరుగులు తీస్తూ ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందిస్తోంది. దీంతో అనేక మంది మల్టీబ్యాగర్ రాబడులను పొందారు.

ఈ ఏడాది వరుసగా ఎలక్ట్రిక్ బస్సు ఆర్డర్లను పొందటంతో స్టాక్ మల్డీబ్యాగర్ రాబడులను అందించటం ప్రారంభించింది. గడచిన రెండు నెలల కాలంలో స్టాక్ ధర రెండింతలు పెరిగింది. ఈ రోజు మార్కెట్లో స్టాక్ ధర రూ.763.55గా ఉంది. అలాగే స్టాక్ ధర గడచిన ఆరు నెలల కాలంలో 54 శాతానికిపైగా లాభపడింది. తాజాగా జూన్ 1, 2023న స్టాక్ ధర 52 వారాల గరిష్ఠ స్థాయి అయిన రూ.786ని తాకింది.
నాలుగో త్రైమాసికంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 52 శాతం మేర పెరిగి రూ.27.01 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో లాభం రూ.17.77 కోట్లుగా ఉంది. అలాగే ఇటీవల ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.375.91 కోట్లకు చేరుకుంది. సరఫరా అంతరాయాలు కొనసాగుతున్నప్పటికీ కంపెనీ దృష్టి తయారీ, సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించుకోవటంపై ఉంచినట్లు కంపెనీ మేనేజ్‌మెంట్ వెల్లడించింది.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.


Click it and Unblock the Notifications