For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాత పర్సనల్ కంప్యూటర్లు వాడుతున్నారా? ఎలాంటి నష్టం ఉంటుందో తెలుసా?

|

మొబైల్ ఫోన్ల వినియోగం పెరిగిపోయిన నేపథ్యంలో అనేక రకాల పనులను వీటి ద్వారానే చేసుకునే అవకాశం ఏర్పడుతోంది. అయితే చాలా మంది ఉద్యోగస్తులు, కంపెనీలు మొబైల్ ఫోన్ల ద్వారా తమ పనులను చక్క బెట్టుకుని పరిస్థితి ఉండదు. కాబట్టి కంప్యూటర్లను వాడాల్సిందే. అయితే చాలా మంది తమ కంప్యూటర్లను అప్డేట్ చేసుకోవడానికి బద్ద కిస్తుంటారు. కొత్త కొత్త కంప్యూటర్లు, ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చినా పాత వాటితోనే నెట్టుకు వస్తుంటారు. ఇలా చేయడం వల్ల పని ప్రదేశంలో ఉత్పాదత తగ్గడమే కాకుండా సెక్యూరిటీ పరమైన దాడులకు గురయ్యే అవకాశం ఉంటుందని మైక్రోసాఫ్ట్ అధ్యయనం హెచ్చరిస్తోంది.

దక్షిణాదిలో ఎస్ఎంబీలు

దక్షిణాదిలో ఎస్ఎంబీలు

* దక్షిణాది రాష్ట్రాల్లోని చిన్న, మధ్య తరహా వ్యాపార (ఎస్ఎంబీ) సంస్థలు పాత పర్సనల్ కంప్యూటర్లను ఎక్కువగా వినియోగిస్తున్నట్టు అధ్యయనం లో వెల్లడించారు. దీని మూలంగా పని ప్రదేశంలో ఉండాల్సిన ఉత్పాదకత తగ్గడానికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. అంతే కాకుండా భద్రత పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవచ్చని తెలిపింది.

* ఎస్ఎంబీ లు నాలుగేళ్లకు మించిన పాత కంప్యూటర్లను వినియోగిస్తున్నాయని.. వీటిలో పాత ఆపరేటింగ్ సిస్టమ్ ఉందని చెబుతోంది. కొత్త పీసీలతో పోల్చితే పాత పీసీల ఉత్పాదకత బాగా తక్కువగా ఉంటుందని పేర్కొంది.

* పాత పీసీలు తమ సంస్థలను సెక్యూరిటీ పరంగా ఇబ్బందుల పాలు చేయవచ్చని తెలిపింది. అంతే కాకుండా ఐటీ పరమైన దాడులకు ఆస్కారం ఉండవచ్చని హెచ్చరించింది

రిపేర్లు ఎక్కువే..

రిపేర్లు ఎక్కువే..

* కొత్త పీసీల్లో ఆధునిక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సరికొత్త ఫీచర్లు ఉంటాయి. వీటి మూలంగా తమ పనిని మరింత వేగంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. పని వేగంగా పూర్తి కావడం వల్ల ఉద్యోగుల్లోనూ ఉత్సాహం ఉంటుంది. ఎక్కువ ఉత్పాదకతకు ఆస్కారం ఉంటుంది. కాగా పాత పీసీలు ఎక్కువగా రిపేర్లకు వస్తుంటాయి. రామ్ వేగం తక్కువగా ఉంటుంది. కొత్త అప్లికేషన్లకు ఈ సిస్టమ్స్ సపోర్ట్ చేయవు. తరచూ రిపేర్లు వస్తుంటాయి. కొత్త పీసీ లతో పోల్చితే పాత పీసీలు దాదాపు నాలుగు రేట్లు ఎక్కువ రిపేర్లు వస్తుంటాయట. ఇలాంటి అనుభవాన్ని ఎస్ఎంబీలు చవిచూశాయట. దీని వల్ల ఎక్కువ మొత్తం రిపేర్ల కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది.

* ఇక దక్షిణాదిలోని ఎస్ఎంబీలు పాత కంప్యూటర్ల నుంచి డేటాను రికవరీ చేయడానికి వ్యాపారాన్ని నిర్వహించడానికి సవాళ్ళను ఎదుర్కొంటున్నాయట.

* కనీసం 96 గంటల ఉత్పత్తి సమయాన్ని కూడా కోల్పోతున్నట్టు అధ్యయనం చెబుతోంది.

అవుట్ డేటెడ్ పీసీలు ఎక్కువే..

అవుట్ డేటెడ్ పీసీలు ఎక్కువే..

* మైక్రోసాఫ్ట్ అధ్యయనం ప్రకారం గత ఏడాదిలో దక్షిణాది రాష్ట్రాల్లోని ఎస్ఎంబీలలో 25 శాతం సెక్యూరిటీ సమస్యను ఎదుర్కొన్నట్టు సర్వేలో వెల్లడైంది.

* దాదాపు 40 శాతం ఎస్ఎంబీలు అవుట్ డేటెడ్ పీసీలను వాడుతున్నారట. అంతే కాకుండా 62 శాతం వాడుతున్నారు.

* దేశవ్యాప్తంగా ఉన్న ఎస్ఎంబీలు 11 కోట్లకు పైగా మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో ఈ కంపెనీలు కీలకంగా ఉన్నాయి.

English summary

పాత పర్సనల్ కంప్యూటర్లు వాడుతున్నారా? ఎలాంటి నష్టం ఉంటుందో తెలుసా? | Older PCs increasing productivity loss for SMBs in South India: study reveals

Microsoft latest study reveals that using older PCs are likely to experience reduced work place productivity and security vulnerablities. Small and Medium Business in South india are using more older personal computers.
Story first published: Thursday, December 12, 2019, 7:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X