కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వెహికల్ స్క్రాపింగ్ పాలసీ పై చాలా మంది దృష్టి సారించారు. ఒకవేళ అది అమల్లోకి వస్తే ఒక వాహనం కొనుగోలు చేసి 15 ఏళ్లు దాటినట్లయితే మరోసారి దాన్ని సెకండ్ హ్యాండ్ కింద కొనాలంటే ఖరీదు ఎక్కువగానే అవుతుందని చెబుతున్నారు విశ్లేషకులు. ఆ వాహనం కమర్షియల్ వెహికల్ కేటగిరీలోకి వస్తే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందేందుకు అయ్యే ఖర్చు దాదాపు 62 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయించాలంటే 8 రెట్లు ఎక్కువగా ఖర్చు అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది చాలదన్నట్లుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ టాక్స్ కూడా విధిస్తాయి. ఇది రోడ్ టాక్స్‌కు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

మరో రెండు వారాల్లో స్క్రాపింగ్ పాలసీ
మరో రెండు వారాల్లో రహదారుల మరియు రవాణా మంత్రిత్వ శాఖ స్క్రాపింగ్ పాలసీని ప్రకటించనుంది. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ప్రస్తుతం 8 ఏళ్లు దాటిన వాహనంకు ప్రతి ఏటా ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందడం తప్పనిసరి. అంతేకాదు దీనిపై గ్రీన్ టాక్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది. ఇది సాధారణంగా చెల్లించే రోడ్ టాక్స్‌కు అదనంగా 10శాతం నుంచి 25 శాతం ఉంటుంది. ప్రస్తుతం నిబంధనలు ఇలా ఉన్నాయి.

పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు
15 ఏళ్లు అంతకంటే ఎక్కువగా వాడుకలో ఉన్న ప్రైవేట్ వాహనంకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ద్విచక్ర వాహనాలకైతే ప్రస్తుతం ఉన్న రూ.300 నుంచి రూ.1000కి పెరిగే అవకాశాలుండగా... అదే కార్లకు అయితే ప్రస్తుతం ఉన్న రూ.600 నుంచి రూ.5000 వరకు పెరిగే అవకాశాలున్నాయి. దీనికి అదనంగా ఐదేళ్ల పాటు గ్రీన్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక రెండు కేసులు తీసుకున్నట్లయితే ఆటోమాటిక్ ఫిట్‌నెస్ టెస్టులో వాహనాలు కనుక విఫలమైతే... వాటిని వాహన్ అనే డేటా బేస్ నుంచి తొలగించబడుతుంది.

అవగాహన కల్పించే యోచనలో ప్రభుత్వం
ప్రస్తుతం శాంక్షన్ అయిన 25 ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ టెస్టు కేంద్రాల్లో కేవలం 7 మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. రెండు ఆథరైజ్డ్ స్క్రాపింగ్ కేంద్రాలు ఉండగా అందులో ఒకటి నోయిడాలో ఉంది. ఇక స్క్రాపింగ్ పాలసీల గురించి ఒక వాయిస్ మెసేజ్ రూపంలో అవగాహన తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. వాహన యజమాని యొక్క మొబైల్‌కు వాయిస్ మెసేజ్ పంపడంగానీ, పెట్రోల్ పంపులు కేంద్రంగా ప్రకటనలు ఇవ్వడం కానీ చేయాలని భావిస్తోంది. అంతేకాకుండా దొంగలించబడ్డ వాహనాలకు స్క్రాపింగ్ పాలసీ అమలు కాకుండా చర్యలు తీసుకునేలా పగడ్బందీగా విధానాలను రూపొందిస్తున్నట్లు సమాచారం
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications