Ola EV: డిస్ట్రిబ్యూషన్ నెట్‍వర్క్ 4 రెట్లు పెంచిన ఓలా.. ఇకపై షోరూం దగ్గరే సర్వీస్ సెంటర్లు..
Ola Electric: భారతదేశంలో ఈవీ రంగంలో పెద్ద మార్పులు జరుగుతున్నాయు. ఈ క్రమంలో పోటీ సైతం ఎక్కువగానే ఉన్నందున దీనిని తట్టుకునేందుకు, కస్టమర్లకు మరింతగా చేరువకావాలని ఓలా నిర్ణయించింది. ఈ క్రమంలో కంపెనీ తన స్టోర్ల ఏర్పాటుతో పాటు సర్వీస్ మెరుగుపరచటంపై దూకుడు పెంచింది.
దేశంలో అతిపెద్ద ఈవీ టూవీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ డిసెంబర్ 20, 2024 నాటికి తన స్టోర్ నెట్‌వర్క్‌ను 4,000కి పెంచింది. 3,200కి పైగా కొత్త స్టోర్లు తెరవబోతున్నందున ఓలా దేశంలోని అన్ని పిన్‌కోడ్‌లను కవర్ చేస్తూ అతిపెద్ద ఈవీ పంపిణీ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. ఇది దేశంలో యాక్సెస్, వృద్ధి, స్వీకరణను ప్రోత్సహిస్తుంది. దేశవ్యాప్తంగా కంపెనీ సర్వీస్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తూ.. కొత్తగా ప్రారంభించిన అన్ని స్టోర్‌లు సర్వీసె ఫెసిలిటీలతో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో కంపెనీ తన స్టోర్లను ఏకంగా నాలుగు రెట్ల వేగంతో విస్తరించింది.

దేశం ప్రస్తుతం ఎలక్ట్రిక్ మెుబిలిటీ వైపు వేగంగా కదులుతోందని ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా తాము స్టోర్ నెట్‍వర్క్ విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో విస్తృత D2C నెట్‌వర్క్‌తో పాటు నెట్‌వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్ కింద టచ్‌పాయింట్‌లు, టైర్-I నగరాలను దాటి దేశం మొత్తాన్ని కవర్ చేయనున్నట్లు వెల్లడించారు. కంపెనీ ఓలా గిగ్, ఓలా గిగ్ ప్లస్, ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్ ప్లస్లతో కూడిన దాని గిగ్, S1 Z స్కూటర్ శ్రేణిని ప్రారంభించినట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
వీటి ధరలు సాధారణ మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటులో రూ.40 వేల నుంచి రూ.65 వేల మధ్య ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఇది గ్రామీణ, సెమీ అర్బన్ కస్టమర్లను టార్గెట్ చేసి విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటి డెలివరీలను 2025 ఏప్రిల్-మే మధ్య నుంచి ప్రారంభించాలని చూస్తోంది. కస్టమర్లు కేవలం రూ.499 చెల్లించి తమ ఈవీని బుక్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.
కంపెనీ ప్రస్తుతం అమ్మకాలతో పాటు యూజర్ ఎక్స్ పీరియన్స్ మెరుగుపరచటంపై దృష్టి సారించినట్లు ప్రకటించింది. ఇప్పుడు EV స్వీకరణను వేగవంతం చేయడానికి రోల్‌అవుట్ ప్లాన్‌ను రెట్టింపు చేస్తోంది. భారీ స్టోర్ విస్తరణ, సేవా కేంద్రాలతో పాటు, కంపెనీ ఇటీవల ప్రారంభించిన హైపర్‌సర్వీస్ చొరవకు ఊపందుకుంటుంది. అదనంగా ఓలా 2025 చివరి నాటికి సేల్స్ అండ్ సర్వీస్‌లో 10,000 మంది భాగస్వాములను ఆన్‌బోర్డ్ చేయడానికి నెట్‌వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ప్రతి మెకానిక్‌ని EV-సిద్ధంగా ఉండేలా లక్ష మంది థర్డ్-పార్టీ మెకానిక్‌లకు శిక్షణ ఇచ్చే లక్ష్యంతో కంపెనీ తన ఈవీ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది.


Click it and Unblock the Notifications