ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా దెబ్బకు ... భారత్ కూడా ప్రభావితమవుతోంది. అన్ని రంగాల్లోనూ కరోనా వైరస్ ప్రభావం కనిపిస్తోంది. ప్రజలంతా ఇండ్లకే పరిమితం అవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని గట్టిగా నిర్ణయం తీసుకుంటున్నారు. దీంతో గత రెండు మూడు రోజులుగా ట్రాఫిక్ చాలా తక్కువగా కనిపిస్తోంది. మెట్రోల్ రైళ్లు, బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య సగానికి పైగా పడిపోతోంది. వైరస్ ప్రబల కుండా ప్రయాణికులు తమ వ్యక్తిగత వాహనాలనే వినియోగించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
పక్కవారితో ప్రయాణాలను పంచుకునేందుకు ఇష్టపడటం లేదు. చైనా లో మొదలైన కరోనా వైరస్... ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది. ఇప్పటికే సుమారు 170 దేశాలకు పైగా విస్తరించి అందరికీ చెమటలు పట్టిస్తోంది. సుమారు 10,000 మందిని బలి తీసుకున్న కరోనా వైరస్ ... 2 లక్షల కంటే అధిక ప్రజలకు సోకి వారిని ఇబ్బంది పెడుతోంది. దీనికి విరుగుడు మందులు లేకపోవటంతో డాక్టర్లు, నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుత పరిణామాలను జాగ్రత్తగా గమనించిన ప్రముఖ రైడ్ హైలింగ్ కంపెనీలు ఉబెర్, ఓలా ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి..

నో షేరింగ్...
రైడ్ హైలింగ్ సంస్థలు ఉబెర్, ఓలా లు రైడ్ షేరింగ్ ఆప్షన్ అందిస్తాయి. ఈ ఆప్షన్ ఎంచుకోవటం వల్ల ఒక ప్రయాణికుడు మొత్తం క్యాబ్ కు అయ్యే ఖర్చులో దాదాపు సగం ధరకే తన గమ్య స్థానం చేరుకునే అవకాశం లభిస్తుంది. ఖర్చులు తగ్గుతాయి కాబట్టి... చాలా మంది ప్రయాణికులు రైడ్ షేరింగ్ ను ఎంపిక చేసుకుంటారు. కానీ, కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి ప్రబలుతోంది కాబట్టి, మనకు అసలు తెలియని వారితో ప్రయాణాలు చేసేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. అందుకే ఉబెర్, ఓలా కూడా రైడ్ షేరింగ్ ఆప్షన్ ను తాత్కాలికంగా రద్దు చేశాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నట్లు రెండు సంస్థలు వేర్వేరు ప్రకటనలో వెల్లడించాయి. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక ప్రత్యేక కథనంలో పేర్కొంది.

లక్షల్లో రైడ్లు...
ఉబెర్, ఓలా క్యాబుల్లో రోజుకు కొన్ని లక్షల మంది ప్రయాణికులు తమ తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. ఈ రెండు సంస్థలు సగటున రోజుకు 35 లక్షల నుంచి 37 లక్షల రైడ్స్ నిర్వహిస్తాయి. ఒక్కో రైడ్ లో సగటున ఇద్దరు ప్రయాణికులు ఉన్నా... రోజుకు ఈ రెండు సంస్థలే దేశంలో దాదాపు కోటికిపైగా ప్రజలను గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. అధికారిక గణాంకాలు లేనప్పటికీ... సగటున 10% రైడ్లు షేరింగ్ వి ఉంటాయని ఈ రంగంలో పనిచేసే ఒక వ్యక్తి వెల్లడించారు. రైడ్ షేరింగ్ వల్ల ఖర్చులు తగ్గే అవకాశం ఉంది కాబట్టి, అధిక సంఖ్యలో ప్రయాణికులు ఈ ఆప్షన్ ను ఎంపిక చేసుకునేవారు. కానీ, ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో రెండు సంస్థలు కూడా ప్రయాణికుల ఆరోగ్య సంరక్షణ కోసం రైడ్ షేరింగ్ ను రద్దు చేశాయి.

సగానికి పడిపోయిన డిమాండ్...
రోనా వైరస్ భారత్ లో ప్రబలిన దగ్గర నుంచి ఉబెర్, ఓలా క్యాబులకు డిమాండ్ తగ్గినట్లు డ్రైవర్లు చెబుతున్నారు. గతంతో పోల్చితే దాదాపు సగానికి పైగా డిమాండ్ పడిపోయిందని వారు వాపోతున్నారు. ఒకే క్యాబ్ లో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు క్యాబ్ లను ఆశ్రయించకపోవటమే బెటర్ అని ప్రయాణికులు భావిస్తున్నారు. ఇక రైడ్ షేరింగ్ ఆప్షన్ అయితే అస్సలు ఎవరూ వాడటం లేదని డ్రైవర్లు తెలిపారు. అత్యవసరం అయితే సొంతంగా క్యాబ్ బుక్ చేసుకుంటున్నారు తప్ప షేరింగ్ కోసం ఎవరూ చూడటం లేదని చెప్పారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే బ్యాంకులకు కట్టాల్సిన ఈఎంఐ లు పెండింగ్లో పడిపోయే పరిస్థితి నెలకొందని, అసలు తాము ఇంటి అద్దెలు కూడా చెల్లించే పరిస్థితి లేదని వారు ఆందోళన చెందుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications