Ola New business: క్యాబ్ అగ్రిగేటర్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన ఓలా.. క్రమేపీ ఇతర రంగాల్లోనూ సత్తా చాటేందుకు ముందుకు కదులుతోంది. ఇప్పటికే రైడ్ హెయిలింగ్‌లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకోగా.. ఇటీవల గూగుల్‌ను ఛాలెంజ్ చేస్తూ సొంతగా మ్యాప్స్ రిలీజ్ చేసింది. ఇప్పుడు మరో వ్యాపారంలో సత్తా చాటేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంంటోంది.
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం క్విక్ కామర్స్ విభాగం ఊపందుకుంది. ప్రముఖ కంపెనీలుగా భావిస్తున్న పలు సంస్థలు ఇప్పటికే ఈ రంగంలో ప్రవేశించాయి. ఇ-కామర్స్‌తో పోలిస్తే క్విక్ కామర్స్ రంగానికి మంచి భవిష్యత్ ఉంటుందన్న అంచనాలతో ఆశావహులు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఓలా కూడా ఇప్పుడు ఈ లిస్టులోకి చేరింది. ఇందులో భాగంగా ఓలా క్యాబ్స్ మాతృ సంస్థ ANI టెక్నాలజీస్ క్విక్ డెలివరీ విభాగంలో డిమాండ్ తీర్చడం కోసం సొంత డార్క్ స్టోర్లు ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు సమాచారం.

క్విక్ కామర్స్ డెలివరీ కోసం ఉత్పత్తులను నిల్వ ఉంచే ఈ గిడ్డంగులలో మానవ ప్రమేయాన్ని తగ్గించేందుకు ఓలా రోబోలను మోహరించనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక వినియోగదారులను ఆకర్షించేందుకు తన సొంత UPI సేవలను సైతం ప్రారంభించాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలిసింది. ఆగస్టు 15న జరిగనున్న స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో CEO భవిష్ అగర్వాల్ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఎలాగో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీలోనూ ఓలా నిమగ్నమై ఉండటంతో వాటిని ఈ వ్యాపారాభివృద్ధిలో వినియోగించవచ్చని ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. డాష్‌ను ఎండ్-టు-ఎండ్ క్విక్ కామర్స్ సర్వీస్‌గా ప్రారంభించి 2022లో మూసివేసిన తర్వాత ఓలా మరోసారి తన అదృష్టాన్ని పరిష్కరించుకోనుంది. ఈ విభాగంలోని ఇతర ప్లేయర్స్ నుంచి ఇప్పటికే వేర్‌హౌస్‌లకు మంచి డిమాండ్ ఉండటంతో భవిష్ కంపెనీ తీవ్ర పోటీని ఎదుర్కోనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications