Ola News: ఏప్రిల్ 1 నుంచి ఆ సేవలు నిలిపివేయనున్న ఓలా.. కస్టమర్లకు మెసేజ్‌లు..

Ola Money Wallet: నగరాలు, పట్టణాల్లో బైక్ రైడింగ్ మరియు క్యాబ్ సేవలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. బస్సుల వేళలు, రద్దీ దృష్ట్యా పలు కొత్త సంస్థలు ఈ విభాగంలో పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వినబడే పేరు ఓలా. ఈ సంస్థ తాజాగా తన వ్యాలెట్ పేమెంట్స్‌ పై కీలక ప్రకటన చేసింది.

ఏప్రిల్ 1 తర్వాత నుంచి ఓలా మనీ వాలెట్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ వాలెట్‌ని పూర్తి KYC నుంచి చిన్న ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (PPI)కి మార్చుకోవాలని తెలిపింది. ఈ విధానంలో గరిష్ఠంగా నెలకు 10 వేల వాలెట్ లోడ్ పరిమితి ఉంటుందని వెల్లడించింది.

Ola suspended its walet services from April 1

ఒకవేళ PPIకి మారేందుకు వినియోగదారులకు ఏవైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో వారు పూర్తిగా నగదు మొత్తాన్ని ఉపసంహరణ చేసి వాలెట్‌లను మూసివేయవచ్చని ఓలా పేర్కొంది. బ్యాంక్ కు బదిలీ చేసుకునేందుకు ఎటువంటి రుసుమూ ఉండదని స్పష్టం చేసింది. కస్టమర్లు దీనిపై చర్యలు తీసుకునే వరకు వాలెట్ సస్పెండ్ చేయబడుతుందని వివరించింది.

'OFS అంతర్గత విధానంలో మార్పుకు అనుగుణంగా మనీ వాలెట్ పూర్తి KYC నుంచి స్మాల్ PPIకి పూర్తిగా మారుతోంది. ఇప్పటికే పూర్తి KYC కలిగిన ఓలా మనీ వాలెట్ వినియోగదారులకు మాత్రమే ఈ మార్పు వర్తిస్తుంది. ఇందుకోసం యాప్‌లో 'యాడ్ మనీ' ఆప్షన్‌పై క్లిక్ చేసిన అనంతరం వాలెట్‌ను PPIకి మార్చేందుకు వచ్చే ఆప్షన్‌ను కస్టమర్లు వినియోగించుకోవాలి' అని ఓలా కోరింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+