For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ola EV: టెస్లాకు ప్రత్యామ్నాయంగా ఓలా ఎలక్ట్రిక్ కార్.. సూపర్ ఫీచర్లతో మార్కెట్లోకి.. ప్రత్యేకతలు ఇవే..

|

Ola ELectric Car: ప్రపంచంలోనే అతిపెద్ద సంపన్నుడిగా ఉన్న ఎలాన్ మస్క్‌కి చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా ప్రస్తుతానికి భారత్‌లోకి ప్రవేశించే ఉద్దేశ్యం లేదని తెలుస్తోంది. అయితే దేశీయ కంపెనీ ఓలా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. త్వరలోనే దేశంలో తమ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కంపెనీ తన ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించింది. ఇది 2024 నాటికి దేశంలోని రోడ్లపైకి వస్తుందని వెల్లడించింది. కేవలం ఒక్కసారి ఛార్జింగ్‌తో 500 కిమీలు పరుగులు తీస్తుందని కంపెనీ పేర్కొంది. అంటే ఈ కారుతో ఒక ప్రయాణికుడు ఒక్కసారి ఛార్జింగ్‌ చేసి ఢిల్లీ నుంచి లక్నోకు ప్రయాణించగలరని తెలుస్తోంది.

అత్యధిక వేగం ఎంతంటే..

అత్యధిక వేగం ఎంతంటే..

ఓలా వ్యవస్థాపకుడు, CEO భవిష్ అగర్వాల్ ఆగస్ట్ 15న వర్చువల్ ఈవెంట్‌లో ఓలా ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించారు. ఇది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్ ప్రాజెక్ట్ అని ఆయన అన్నారు. 2024 నాటికి ఈ కారును దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. కేవలం ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 500 కిమీ ప్రయాణం సాగించవచ్చని వెల్లడించారు. కార్ సున్నా నుంచి 100 కిమీ వేగానికి చేరుకోవటానికి కేవలం 4 సెకన్లలో చేరుకుంటుందని తెలిపారు.

కారు ప్రత్యేకతలు..

కారు ప్రత్యేకతలు..

భారత్ EV విప్లవానికి కేంద్రంగా మారాలని, ప్రపంచ ఆటోమోటివ్ మార్కెట్లో 25% వాటాను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అగర్వాల్ పేర్కొన్నారు. దీనిని తాము భారత్ కోసం నిర్మిస్తున్నామని, ఇది ప్రపంచానికి కూడా ఉదాహరణ అవుతుందని అగర్వాల్ తెలిపారు. తాము సెమీకండక్టర్, సోలార్, ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పాదక విప్లవాలలో వెనుకబడి ఉన్నామన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ సెల్స్, బ్యాటరీ టెక్నాలజీలపై పెట్టుబడి పెడితే మార్కెట్‌లో మనం అగ్రగామిగా ఉండగలమని పేర్కొన్నాడు.

అత్యంత అధునాతన ఫ్యూచర్స్..

అత్యంత అధునాతన ఫ్యూచర్స్..

ఇప్పటివరకు దేశంలోనే అత్యంత స్పోర్ట్స్‌ లుక్ లో కనిపించే కారు ఇదని తమ ఎలక్ట్రిక్ కారు గురించిన కంపెనీ ఒక ప్రకటనలో ప్రకటించింది. ఇది రూఫ్ గ్లాస్‌తో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతన కంప్యూటర్‌ను కలిగి ఉంటుందని వెల్లడించింది. అలాగే.. ఇందులో కీలెస్, హ్యాండిల్‌లెస్ డోర్లు ఉంటాయి. కారు Ola స్వంత MoveOS సాఫ్ట్‌వేర్ తో అనుసంధానించబడి ఉంటుందని వెల్లడించింది. దీని ద్వారానే కారు యజమానులు ఫీచర్స్ అప్‌డేట్‌లను పొందుతాయని తెలిపింది. పైగా కంపెనీ దేశంలోని 50 ప్రధాన నగరాల్లో 100 హైపర్‌చార్జర్‌లను ప్రారంభించినట్లు తెలిపింది.

Read more about: business news
English summary

Ola EV: టెస్లాకు ప్రత్యామ్నాయంగా ఓలా ఎలక్ట్రిక్ కార్.. సూపర్ ఫీచర్లతో మార్కెట్లోకి.. ప్రత్యేకతలు ఇవే.. | ola revealed about its new electric car with advanced features that travels 500 kms in single charge

know about ola revealed about its new electric car with advanced features
Story first published: Tuesday, August 16, 2022, 10:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X