Ola Scooters: దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. అమ్మకాల పరంగా దేశంలో తొలిస్థానంలో నిలిచిన ఓలా ఎలక్ట్రిక్ దేశంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది.
గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఓలా యూనిటీ హెరిటేజ్ రైడ్ పేరుతో భారీ కమ్యూనిటీ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది. రైడ్‌లో భాగంగా ఓలా కమ్యూనిటీకి చెందిన వందలాది మంది సభ్యులు భారతదేశ వారసత్వం, సంస్కృతిని ప్రోత్సహించడానికి విద్యుద్దీకరణ స్ఫూర్తి, దేశభక్తి ఉత్సాహంతో దేశంలోని 26 నగరాల్లోని వారి సమీప వారసత్వ ప్రదేశానికి వెళ్లారు.

ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాహన ప్రియులు ఈవీకి మారడానికి, భారత ఈవీ విప్లవంలో చేరేందుకు అద్భుతమైన తగ్గింపును ప్రకటించింది. ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై గరిష్ఠంగా రూ.25,000 తగ్గింపులను జనవరి 31, 2024 వరకు అందుబాటులో ఉంచింది. అలాగే కస్టమర్లకు అదనపు వారెంటీపై 50 శాతం తగ్గింపును అందిస్తోంది. అలాగే ఓలా S1 ప్రో, S1 ఎయిర్ మోడల్‌లపై రూ.2,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు.
అలాగే ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు ఈఎంలపై వినియోగదారులుకు రూ.5,000 తగ్గింపును అందిస్తోంది. అయితే ఇతర ఫైనాన్స్ ఆఫర్‌లలో జీరో డౌన్ పేమెంట్, జీరో-ప్రాసెసింగ్ ఫీజు, 7.99% తక్కువ వడ్డీ రేట్లు వంటి ఇతర డీల్స్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి. అదనంగా S1 X+పై ఫ్లాట్ రూ.20,000 తగ్గింపుతో రూ.89,999 రేటుకు మార్కెట్లో అందుబాటులో ఉంది.

ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తన స్కూటర్ పోర్ట్‌ఫోలియోను ఐదు ఉత్పత్తులకు విస్తరించింది. ఫ్లాగ్‌షిప్ మోడల్ S1 Pro సెకండ్ జనరేషన్ ధర రూ.1,47,499, S1 Air ధర రూ.1,19,999 వద్ద అందుబాటులో ఉంది. ఇదే క్రమంలో S1X కేటగిరీ కింద పరిచయం చేయబడిన మూడు వేరింట్లకు రిజర్వేషన్ ధర కేవటం రూ.999గా కంపెనీ ఉంచింది. అలాగే వీటి ధరల శ్రేణి రూ.99,999 నుంచి రూ.89,999గా ఉన్నట్లు ప్రకటించింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications