Ola: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు: ధర..ఫీచర్లు ఇవే: ఒక్కసారి ఛార్జ్ చేస్తే..!

ముంబై: ఆన్‌లైన్ రెంటెడ్ కార్స్ బుకింగ్ ప్లాట్ ఫామ్ ఓలా.. మరో సంచలనానికి తెర తీసింది. ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టింది. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కొద్ది సేపటి కిందటే వాటిని ఆవిష్కరించింది. విద్యుత్ ఆధారంగా నడిచే వాహనాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోండటం, కాలం చెల్లిన పెట్రోల్, డీజిల్ వెహికిల్స్‌ను తుక్కు కిందికి మార్చుతూ ప్రత్యేకంగా స్క్రాప్ విధానాన్ని తీసుకుని రావడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగంలో అడుగు పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ధర ఎంత..?

ధర ఎంత..?

కొత్తగా ఆటోమొబైల్ సెక్టార్‌లో ఎలాంటి వాహనం ప్రవేశించినా..మొదట కన్జ్యూమర్లు దాని ధరను తెలుసుకునే ప్రయత్నం చేస్తానడంలో సందేహాలు అనవసరం. ఇక్కడ కూడా అదే పరిస్థితి. పెట్రోల్ ఆధారిత ద్విచక్ర వాహనాలతో పోల్చుకుంటే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల రేటు ఒకింత ఎక్కువే. దీని ప్రారంభ ధర 99,999 రూపాయలు. గుజరాత్‌ వంటి ఒకట్రెండు రాష్ట్రాల్లో ఈ స్కూటర్ బేసిక్ ప్రైస్ 79,000 రూపాయలుగా ఉంటోంది. మోడల్‌కు అనుగుణంగా ప్రైస్ ట్యాగ్ మారుతుంటుంది.

హైఎండ్ రేంజ్..

హైఎండ్ రేంజ్..

మొత్తం రెండు మోడళ్లలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. కార్ల తరహాలో ఇందులో కూడా హైఎండ్ రేంజ్‌ను ప్రవేశపెట్టింది ఓలా యాజమాన్యం. ఎస్1 మోడల్ ప్రారంభ ధర 99,999గా నిర్ధారించింది. మరో మోడల్ లాంగ్ రేంజ్ ఎస్1 ప్రో రేటు 1,29,999 రూపాయల వరకు ఉంటోంది. రాష్ట్రాల వారీగా ఈ రేటు మారుతుంటుంది.

ఎస్ ప్రో మోడల్ ధర ఢిల్లీలో 1,10,149 రూపాయలు కాగా, గుజరాత్‌లో 1,09,999 మహారాష్ట్రలో 1,24,999, గుజరాత్‌లో 1,19,136 రూపాయలుగా ఉంటోంది. ఎస్1 మోడల్ ఎక్స్ షోరూం ధర ఢిల్లీలో 85,099, గుజరాత్ౠ‌లో 79,999, మహారాష్ట్రలో 94,999, రాజస్థాన్‌లో 89,968గా నిర్ధారించారు.

ఈఎంఐ ఆప్షన్ ఉందా?

ఈఎంఐ ఆప్షన్ ఉందా?

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ సౌకర్యాన్ని కల్పించింది ఓలా యాజమాన్యం. ఫైనాన్స్ సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చింది. 2,999 రూపాయలను డౌన్ పేమెంట్‌గా చెల్లించి స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. అక్లోబర్ నుంచి స్కూటర్లను కొనుగోలుదారులకు అందజేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. మొత్తం 10 విభన్న రంగుల్లో అందుబాటులో ఉంటోంది. నీలం, నలుపు, తెలుపు, బూడిద, ఎరుపు, పసుపు వంటి రంగులతో కలుపుకొని మొత్తం 10 కలర్లలో ఈ స్కూటర్లను విడుదల చేసినట్లు ఓలా అధినేత భావిష్ అగర్వాల్ తెలిపారు.

ఎస్1, ఎస్1 ప్రొ మధ్య తేడా ఏంటీ?

ఎస్1, ఎస్1 ప్రొ మధ్య తేడా ఏంటీ?

ప్రారంభంలో ఎస్1, ఎస్1 ప్రొ రెండు మోడల్స్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించింది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏమిటంటే- ఎస్1 మోడల్ స్కూటర్.. టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని ఈ మోడల్ స్కూటర్ 3.6 సెకెన్లలోనే అందుకుంటుంది. 8.5 కిలోవాట్ల పీక్ పవర్‌తో డ్రైవింగ్ రేంజ్ 121 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఎస్1 ప్రొ మోడల్ స్కూటర్- అదే 8.5 కిలోవాట్లతో పీక్ పవర్ డ్రైవింగ్ రేంజ్ 181 కిలోమీటర్ల వరకు నిర్ధారించారు. గంటకు 115 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ మోటార్‌ను ఇందులో అమర్చింది.

ఒకసారి ఛార్జింగ్ చేస్తే.. ఎంత దూరం వెళ్లొచ్చు..

ఒకసారి ఛార్జింగ్ చేస్తే.. ఎంత దూరం వెళ్లొచ్చు..

ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఇందులో ఉంది. అంటే 18 నిమిషాల్లో 50 శాతం మేర ఛార్జ్ అవుతుంది బ్యాటరీ. ఈ 50 శాతం బ్యాటరీ ఛార్జింగ్‌తో 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని ఓలా కంపెనీ తెలిపింది. ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్‌లో బిగ్గెస్ట్ బూట్ స్పేస్‌గా దీన్ని రూపొందించింది. కాగా టోకెన్ అమౌంట్‌గా 499 రూపాయలను చెల్లించి ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. అండర్ సీట్ స్టోరేజీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ లైటింగ్, మొబైల్ ఫోన్ కనెక్టివిటీ, యాప్ బేస్డ్ కీ లెస్ సౌకర్యం ఇందులో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+