AI: భారత్‌ సొంత AI రూపకల్పన.. ఓలా ఫౌండర్, సద్గురు కీలక కామెంట్స్

AI: ప్రస్తుతం టెక్ రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏలుతోంది. OpenAI తీసుకొచ్చిన ChatGPTని ఆదర్శంగా తీసుకుని ఆయా కంపెనీలు తమ సొంత ఉత్పాదక AIని సృష్టించే పనిలో పడ్డాయి. ఈ సాంకేతికతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా పట్టించుకోకుండా ముందుకెళ్తున్నాయి.

ఓలా వ్యవస్థాపకులు భవిష్ అగర్వాల్ AI టెక్నాలజీ గురించి తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. కోయంబత్తూరులో ఈషా పౌండేషన్ నిర్వహించిన 'ఇన్‌సైట్: ది DNA ఆఫ్ సక్సెస్' 12వ ఎడిషన్‌లో ఆయన ప్రసంగించారు. సాధారణ పౌరుల రోజువారీ జీవితంలో AI కీలక పాత్ర పోషించనుందన్నారు.

Ola founder Bhavish Aggarwal calls for own AI to India

భారత్‌ కూడా సొంతగా AI టెక్నాలజీని రూపొందించాలని పిలుపునిచ్చారు. 'ప్రస్తుతం AI విప్లవం వేగంగా విస్తరిస్తోంది. ఇది మానవ ఉత్పాదకతను ప్రోత్సహిస్తోంది. సైన్స్ మరియు ఆవిష్కరణలను వేగవంతం చేస్తుంది. భవిష్యత్తులో విశ్వ నాయకుడిగా ఎదిగే సత్తా మన దేశానికి ఉంది' అని మరో X పోస్ట్‌లో తెలిపారు.

సాంకేతిక నిపుణులు కూడా ఊహించనంత వేగంగా AI వృద్ధి చెందుతోందని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు అభిప్రాయపడ్డారు. 'ఇప్పటి కంటే భవిష్యత్తులో చాలా వేగంగా మార్పులు జరుగుతాయని ఆశిస్తున్నాను. తద్వారా మానవుల వాల్యూ గ్రహించగలరు. ఎలా బ్రతకాలి అనేది ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువుగా మారుతుంది' అని భావిస్తున్నట్లు చెప్పారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+