Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం దేశంలో చాలా మంది యూజ్ చేస్తున్న ఈవీ బ్రాండ్. దీనికంటే ఉత్తమపనితీరు కనబరిచే అనేక బ్రాండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ.. మార్కెటింగ్, బ్రాండింగ్ వంటి కొన్ని అంశాలు ప్రజలకు కంపెనీని చేరువచేశాయి. వరుసగా కంపెనీ భారీ విక్రయాలు చేపడుతోంది కానీ చాలా కాలంగా కొనుగోలుదారులు పడుతున్న ఇక్కట్లకు మాత్రం దారిచూపించటంలో విఫలం అవుతోంది.
దేశంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో జరిగినన్ని ఘటనలు మరే ఇతర బ్రాండ్ ఈవీల్లో నమోదు కాలేదని చెప్పటం అతిశయోక్తి కాదు. ఓలా ఈవీలతో పనితీరుపై అనేకమార్లు కస్టమర్లు తమ ఫ్రస్టేషన్ ఇప్పటికే చూపిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటనే విశాఖలోనూ చోటుచేసుకుంది. లక్షకు పైగా డబ్బు వెచ్చించి కొన్న బండి గడియగడియకు ఇబ్బంది పెడుతూ రిపేర్లు రావటంతో విసిగిపోయిన ఒక కస్టమర్ ఓలా షోరూంపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. దేశంలోని అనేక ప్రాంతాల్లో సర్వీస్ సరిగా లేకపోవటంతో నెలల తరబడి వాహనాలు సర్వీస్ స్టేషన్లలోనే ఉంటుంన్న సంఘటలను పెరిగిపోతూనే ఉన్నాయి.

ఈరోజుల్లో చాలా మంది తమ ఇంట్లోని ఆడవాళ్లకోసం ఈవీలను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా కొన్న కస్టమర్ బైక్ వాడుతున్నప్పుడు తరచుగా రిపేర్లు వస్తోందని, ఇంట్లోని మహిళలు దీనిని వినియోగించటంలో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేంలేక నిరసన వ్యక్తం చేస్తూ ఓలా బైక్ షోరూంకు తాళం వేశాడు. ఓలా ఈవీ కొని రెండు నెలలు కూడా నిండకముందే 6 సార్లు రిపేర్ వచ్చిందని బండి పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కంపెనీ విక్రయిస్తున్న ఉత్పత్తుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేసిన సదరు కస్టమర్, సర్వీస్ కూడా అద్వానంగా ఉండటంపై ఆగ్రహానికి గురయ్యాడు.
షోరూం యజమానులు బండి సర్వీసింగ్ అడిగితే తమనే తిరిగి బెదిరిస్తున్నారని, ఇదే కంపెనీరా బాబు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బండి పనితీరుతో పాటు కస్టమర్ సర్వీస్ సరిగా లేకపోవటంపై సదరు కస్టమర్ తన ఆగ్రహాన్ని షోరూంకు తాళం వేసి వినూత్నంగా వ్యక్తం చేశాడు. ఇప్పటికే పలుమార్లు ఓలా అద్వాన్న సర్వీసింగ్ గురించి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని కస్టమర్లు తమ వినూత్న నిరసన తెలిపిన ఘటనలు చూశాం. కొందరు తాము కొన్న స్కూటర్లకు నిప్పుపెట్టగా, మరికొందరు షోరూంలకు నిప్పుపెట్టారు. అయితే కంపెనీ మాత్రం తమ సర్వీస్ సేవలను నిరంతరం మెరుగుపరుస్తున్నామని, కొత్తగా వేల సంఖ్యలో షోరూంలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెబుతోంది. అయితే ఆచరణ రూపంలో వాస్తవంగా పరిస్థితులకు కంపెనీ చెబుతున్న విషయాలకు చాలా వ్యత్యాసం ఉంటోందని ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications